ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NRI: వైభవంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవం

ABN, Publish Date - Mar 09 , 2024 | 05:59 PM

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2024 మార్చ్ 3 అదివారం నాడు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ఎన్నారై డెస్క్: స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2024 మార్చ్ 3 అదివారం నాడు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి తెలుగు భాష దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనదో వివరించారు.

Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!

అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ వీరు శేషుకుమారి గానం, శ్రీమతి ప్రత్యూష నాట్యాలను మేళవించి మధురమైన భావనతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌టీఎస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, టీఏఎస్ (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి, శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్నకుమార్, కమల క్లబ్ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, జయ, ప్రత్యూష , సింగపూర్ సుమన్ టీవీ అరుణ తదితర సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం.


స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, వారి శిష్యులు చిన్నారులు కీర్తనలను ఆలపించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్‌కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు, ప్రత్యూష శిష్యులు నాట్యం ప్రదర్శించారు. పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు యడవల్లి శేషుకుమారి ఆచార్య వై. రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం, పైవాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ఆచంట ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలువురికి లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేష స్పందనలను తెలియజేశారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 09 , 2024 | 06:06 PM

Advertising
Advertising