Share News

Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:34 PM

వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల జారీని వేగవంతం చేసేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి.

Dubai: దుబాయ్ వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ టైం 5 రోజులే..!

ఇంటర్నెట్ డెస్క్: వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల జారీని వేగవంతం చేసేందుకు దుబాయ్ (Dubai) చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన వర్క్ బండల్ (Work Bundle) వేదిక కారణంగా ఈ పర్మిట్లకు సంబంధించి డాక్యుమెంట్ల పరిశీలన సమయం 30 రోజుల నుంచి ప్రస్తుతం కేవలం 5 రోజులకు తగ్గింది (Permit Processing Time Cut).

డాక్యుమెంటేషన్ సంక్లిష్టతను తగ్గించడంలో వర్క్ బండిల్ వేదిక మంచి పనితీరు కనబర్చింది. డాక్యుమెంటేషన్‌కు సంబంధించి గతంలోని ఐదు వేదికలు వర్క్ బండిల్ కారణంగా ఒకే వేదికగా మారాయి. దాదాపు ఎనిమిది రకాల సేవలన్నీ ఒకే వేదికగా అందుతున్నాయి. గతంలో 16 డాక్యుమెంట్లను 15 దశల్లో సమర్పించాల్సి ఉండేది. ప్రస్తుతం కేవలం ఐదు డాక్యుమెంట్లను రెండు పర్యాయాల్లో సమర్పిస్తే సరిపోతోంది. దీంతో, డాక్యుమెంటేషన్ పరిశీలన సమయం కేవలం 5 రోజులకు పడిపోయింది.

Indian Tourist: సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?


వర్క్ బండిల్ వేదికను తొలుత దుబాయ్‌లో ప్రవేశపెట్టారు. క్రమంలో దీన్ని ఇతర ఎమిరేట్లకూ విస్తరిస్తున్నారు. ఉద్యోగ సర్వీసులు, ఫింగర్ ప్రింటింగ్, రెన్యూవల్, క్యాన్సిలేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి సర్వీసులను వర్క్ బండిల్ వేదికపైకి తెచ్చారు. తొలుత ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ఈ వర్క్ బండిల్‌ను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో దీన్ని ఇతర ప్రభుత్వ డిజిటల్ వేదికలకూ విస్తరించనున్నారు. వర్క్ బండిల్‌తో రెసిడెన్సీ వీసా పర్మిట్ల జారీ మరింత వేగవంతమైందని దుబాయ్ పాలకుడు షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ వెల్లడించారు.

మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 09:38 PM