ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లోకగౌరవం పొందాలంటే...

ABN, Publish Date - Apr 19 , 2024 | 05:37 AM

దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే ప్రీతిః సాధుజనే నయోః నృపజనే, విద్వజ్జనే చార్జవమ్‌ శౌర్యం శత్రుజనే, క్షమా గురుజనే,...

సుభాషితం

దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే,

శాఠ్యం సదా దుర్జనే

ప్రీతిః సాధుజనే నయోః నృపజనే,

విద్వజ్జనే చార్జవమ్‌

శౌర్యం శత్రుజనే, క్షమా గురుజనే,

కాంతాజనే ధృష్టతా

యే చైవం పురుషాః కలాసు కుశలాస్తే

ష్వేవలోకస్థితిః

లోకుల నుంచి గౌరవం పొందడం కోసం వ్యక్తులకు ఉండవలసిన గుణాలను, లక్షణాలను భర్తృహరి తన ‘నీతిశతకం’లోని ఈ శ్లోకంలో తెలియజేశాడు. దాన్ని...

వరకృప భృత్యులందు నిజ వర్గమునం

దనుకూల వృత్తి కా

పురుషులయందు శాఠ్యము సుబుద్ధులయం

దనురక్తి దాల్మి స

ద్గురువులయందు గౌరవము కోవిదులందు నయంబు రాజులం

దరిజనులందు శౌర్యము మృగాక్షులయందు బ్రగల్భభావ మీ

వరుస కళాప్రవీణులగు వారలయందు వసించు లోకముల్‌... అని చక్కటి తెలుగులో అందించాడు ఏనుగు లక్ష్మణకవి.

భావం: సేవకుల పట్ల దయ, బంధువుల పట్ల ఆప్యాయత, దుష్టుల విషయంలో కాఠిన్యం, సజ్జనులకు ప్రీతిపాత్రంగా ఉండడం, పెద్దల పట్ల ఓర్పు, గురువులపై గౌరవం, పాలకుల పట్ల వినయం, శత్రువులపై శౌర్యం, స్త్రీల పట్ల సమభావం, దృఢచిత్తం కలిగి నడుచుకొనేవారు ఉత్తములు. వారికి ఈ లోకమంతా అనుకూలంగా ఉంటుంది.

Updated Date - Apr 19 , 2024 | 05:37 AM

Advertising
Advertising