జీర్ణక్రియ సాఫీగా...
ABN, Publish Date - Aug 29 , 2024 | 05:37 AM
దానిమ్మ పండులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. రుచితో పాటు ఆరోగ్యం కూడా. అందుకే ప్రతిరోజూ దానిమ్మ గింజలను తినాలంటున్నారు పరిశోధకులు. ఇంతకీ దానిమ్మ ఉపయోగాలేంటీ..
దానిమ్మ పండులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. రుచితో పాటు ఆరోగ్యం కూడా. అందుకే ప్రతిరోజూ దానిమ్మ గింజలను తినాలంటున్నారు పరిశోధకులు. ఇంతకీ దానిమ్మ ఉపయోగాలేంటీ..
దానిమ్మను సూపర్‌ఫుడ్ అంటారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వాపులు తగ్గుతాయి. కీళ్ల వాతం తగ్గిపోతుంది.
దానిమ్మ గింజలను లేదా జ్యూస్‌ను తరచు తీసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఇవి తినటం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా పోతుంది.
పీచుపదార్థం కాబట్టి గుప్పెడు గింజలు తిన్నా.. తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు మెనూలో దానిమ్మ గింజలను చేర్చాల్సిందే.
ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటివి దరిచేరే అవకాశాలు తక్కువ.
దానిమ్మ గింజలను తరచూ తింటుంటే చర్మంలో మృదుత్వం వస్తుంది. దీంతో యంగ్‌గా కనిపిస్తారు.
ఈ పండును తినటం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.
Updated Date - Aug 29 , 2024 | 05:37 AM