OTT platform : ఈ ఫేజ్ బావుంది!
ABN, Publish Date - Jul 08 , 2024 | 05:52 AM
పాపులర్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో ప్రధాన భూమిక పోషించిన నటి శాన్విక. ‘రింకి’ పాత్రలో ఆమె ప్రతిభ అమోఘం అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. శాన్విక గురించి కొన్ని విషయాలు..ఇటీవలే ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్ విడుదలైంది. చాలామంది ఎప్పటిలానే మూడో సిరీ్‌సలోనూ రింకి పాత్ర గురించే
పాపులర్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో ప్రధాన భూమిక పోషించిన నటి శాన్విక. ‘రింకి’ పాత్రలో ఆమె ప్రతిభ అమోఘం అంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. శాన్విక గురించి కొన్ని విషయాలు..ఇటీవలే ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్ విడుదలైంది. చాలామంది ఎప్పటిలానే మూడో సిరీ్‌సలోనూ రింకి పాత్ర గురించే మాట్లాడుతున్నారు. సాధారణ పల్లెటూరు అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. అయితే ‘ఇదంతా రింకీ పాత్ర.. ముఖ్యంగా కంటెంట్ గొప్పదనమే’ అంటోంది శాన్విక.
చిన్నప్పటి నుంచే..
శాన్విక ఇపుడు నేషనల్ క్రష్‌గా మారింది. ఆమె నటించిన పంచాయత్‌లో రింకీగా గుర్తుండిపోతుంది. ఇక ఆమె విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పుట్టి పెరిగింది. బిటెక్ ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చదివింది. చిన్నప్పటి నుంచీ ఆమె నటిని అవ్వాలనుకుంది. ఇంట్లో ఈమెతో కలసి ఐదు మంది ఆడపిల్లలు. వీరిలో శాన్విక చివరి అమ్మాయి. మాధురీ దీక్షిత్, ఇర్ఫాన్‌ఖాన్ లాంటి యాక్టర్స్‌ను ఇష్టపడేది. బిటెక్ తర్వాత బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగం చేయలేనంది. ‘యాక్టింగ్ చేయాలి’ అంటూ తన కోరిక చెప్పింది.. చిన్నప్పటి నుంచి ఇతరులతో మాట్లాడే నేచర్ ఆమెది కాదు. దీంతో తల్లిదండ్రులు యాక్టింగ్ సెట్ కాదన్నారు. అయితే సెట్ అయితే వెళ్తా.. లేకుంటే జాబ్ చేస్తానని ప్రయోగం చేసింది. తన మిత్రురాలితో ముంబైకి వెళ్లింది. తన స్నేహితురాలు బాలీవుడ్ ఇండస్ర్టీకి చెందినది కావటంతో క్యాస్టూమ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగం పెట్టించింది. అప్పుడే ఖాళీ సమయాల్లో సీరియల్స్. యాడ్స్ ఆడిషన్స్‌లో పాల్గొనేది. అలా తొలిసారి డొమినోస్ పిజ్జా యాడ్‌లో నటించింది. అదే ఆమె తొలిసారిగా తెరమీద కనిపించటం.
ఇలా క్రేజ్ వస్తుందని అనుకోలేదు..
చిన్న పాత్రలైనా నటించేది. ఆమె బ్యాంక్ అకౌంట్ జీరో ఉన్న పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెంట్‌గా ఉండేది. యూట్యూబ్ ఛానల్స్ తీసే వెబ్‌సిరీ్‌సలో నటించటానికి ఆడిషన్‌కు వెళ్లింది. వాస్తవానికి ఈమె పేరు పూజా సింగ్. సినిమాకోసం శాన్వికగా మార్చుకుంది. అలా ‘పంచాయత్’ సిరీ్‌సలో ఆమెకు అవకాశం వచ్చింది. తొలి సిరీ్‌సలో ఆమెకు మంచి పేరు రావటంతో మరో రెండు వెబ్‌సిరీ్‌సల్లో నటించింది. ‘పంచాయత్ 2’ సిరీ్‌సకు ఉత్తమనటిగా ఆమెకు అవార్డులు వచ్చాయి. ఇటీవలే మూడో సీజన్ విడుదలైంది. ‘ఇంతలా క్రేజ్ వస్తుందని అనుకోలేదు. నేను పడిన శ్రమ ఊరికేపోలేదు. ఇండస్ర్టీలో నిలదొక్కుకోవటం కష్టం. ప్రతిభ ఉండాల్సిందే’ అంటుంది శాన్విక.
సోషల్ మీడియాలో హవా..
సోషల్ మీడియాలో తన పెంపుడు జంతువుల ఫొటోలను షేర్ చేస్తుంది. దీంతో పాటు వ్యక్తిగత విశేషాలు, కెరీర్ అప్‌డేట్స్‌ను అందిస్తుంది శాన్విక. ఎక్కువగా ప్రకృతిలో గడిపే క్షణాలను నెటిజన్లతో పంచుకుంటుంది. ఇన్‌స్టాలో ఐదు లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది. సిల్వర్‌స్ర్కీన్ మీద కూడా మంచి పాత్రల్లో నటించాలి. అభిమాన హీరోలతో నటించాలి’ అంటోందీమె. ఇంట్లో టీ చేసుకోవటం, మంచి ఫుడ్ వండటం ఇష్టమంటుందామె. ‘పంచాయత్ 2’ సీజన్ విడుదలయ్యాక కూడా నెర్వ్‌సగా ఉండేదాన్ని. ఇపుడలా లేను. ప్రస్తుతానికి ఈ ఫేజ్ బావుంది. ఎంతో ఎంజాయ్ చేస్తున్నా’నంటోంది శాన్విక.
Updated Date - Jul 08 , 2024 | 05:52 AM