ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drumstick tree : మునగ నూనె రాస్తే జుట్టుకు ఎంత బలమంటే.. ఈ నూనెలోని పోషకాలు గురించి తెలుసా..!

ABN, Publish Date - Jan 06 , 2024 | 04:47 PM

మునగ నూనెలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. కుదుళ్ళకు బలాన్నిస్తుంది.

Drumstick tree

మునగ కాయలు, మునగ ఆకు ఇప్పటి రోజుల్లో కాస్త ఎక్కువగానే ఆరోగ్యానికి మంచిదని అంతా ఆహారంలో తింటూనే ఉన్నారు. మునగలో పోషకాలు విటమిన్ సి, ఎ, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. ఇది ఆహారంలో గొప్ప పోషకాలున్న మొక్కగా పేరు పెందింది. మునగ చెట్టులో మరో విశేషం ఏంటంటే మునగ విత్తనాల నుంచి తీసే నూనెను జుట్టు సమస్యలను తీర్చేందుకు వాడుతున్నారు. ఇది జుట్టును ఒత్తుగా పెంచడంలోనూ, చుండ్రు సమస్యను, పొడి బారడాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మునగ నూనె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

మునగ లేదా మోరింగా.. ఈ నూనెను వాడటం వల్ల..

పొడవాటి, మెరిసే, జుట్టు సంరక్షణ కోసం మునగ నూనె మంచి పోషణను ఇస్తుంది. జనపనార గింజల నూనె , మోరింగ నూనె, చమోమిలే, ఒమేగా 3, 6, 9, కొవ్వు ఆమ్లాలు కలిపిన ఈ నూనె కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ మునగ ఆకుల నూనె స్కాల్ప్‌కు లోతుగా పోషణనిస్తుంది, హెయిర్ ఫోలికల్స్‌ను బలపరుస్తుంది.

జుట్టుకు మునగ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మునగ నూనె జుట్టుకు చేసే ప్రయోజనాలు..

1. అవసరమైన పోషకాలను ఇస్తుంది. మునగ నూనెలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌లు వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. కుదుళ్ళకు బలాన్నిస్తుంది.

2. జుట్టును తేమ కాపాడుతుంది. ఈ నూనె తేలికైనది, జిడ్డు లేనిది, ఇది జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్‌ను హైడ్రేట్ చేయడానికి, జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.

3. స్కాల్ప్ పోషణ.. ఈ నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు తలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. తల పొడిబారకుండా, చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: రాగి పాత్రలో నీరు తాగడం కాలేయానికి ప్రమాదాన్ని తెస్తుందా.. !


4. కుదుళ్ళను బలంగా మారుస్తుంది.. మునగ నూనెలు కుదుళ్ళను బలోపేతం చేయడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది చిట్లడం, చివర్లు చీలిపోవడం, జుట్టు రాలడం వంటి సమస్యలను మెరుగుపరిచేలా చేస్తుంది.

5. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.. ఇది జుట్టు బలాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టుకు రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల జుట్టు మందం, పొడవు పెరుగుతుంది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 06 , 2024 | 04:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising