ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Arvinad Kejriwal: బిగ్‌బాస్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుఖేశ్ దిమ్మతిరిగే లేఖ..

ABN, Publish Date - Mar 23 , 2024 | 11:14 AM

ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్‌గా మారాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్‌, సత్యేంద్రజైన్‌, సిసోడియాపై సంచలన ఆరోపణలు చేస్తూ సుఖేష్ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా కవిత అరెస్ట్‌కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలిపెట్టలేదు.

ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ ఎప్పటికప్పుుడు లేఖలు విడుదల చేస్తూ.. పలు సంచలనాలకు కేరాఫ్‌గా మారాడు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత, ఆప్ నేతలు కేజ్రీవాల్‌, సత్యేంద్రజైన్‌, సిసోడియాపై సంచలన ఆరోపణలు చేస్తూ సుఖేష్ ఇప్పటికే పలు లేఖలు విడుదల చేశాడు. తాజాగా కవిత అరెస్ట్‌కు తీహార్ జైలు స్వాగతం పలుకుతుందంటూ లేఖ రాసిన సుఖేష్.. అరవింద్ కేజ్రీవాల్‌ను వదిలిపెట్టలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈనెల 21న ఈడీ అరెస్ట్ చేయగా.. నిన్న ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో 'తీహార్ క్లబ్'లోకి స్వాగతం అంటూ సుఖేష్ మరో లేఖ విడుదల చేశారు.

ముడుపులు డిమాండ్‌ చేసింది కేజ్రీవాలే

కేజ్రీవాల్ మోసగాడు.. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నారు. తీహార్ క్లబ్ బిగ్ బాస్‌గా మిమల్ని స్వాగతిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. మీ డ్రామాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఎంత నటించినా తప్పించుకోలేరని సుఖేష్ లేఖలో రాశాడు. మార్చి 25వ తేదీన తన పుట్టినరోజని, మూడు రోజుల ముందే బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు తెలిపాడు. మీ అరెస్ట్‌ను నా పుట్టినరోజు బహుమతిగా భావిస్తున్నట్లు సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

ముగ్గరు సోదరులు..

తీహార్ జైలును నడపడానికి తన ముగ్గురు సోదరులు ఇక్కడకు వచ్చారని.. ఒకరు ఛైర్మన్ బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ అయితే సీఈవో మనీష్ సిసోడియా, సీఓఓ సత్యేందర్ జైన్ అంటూ సుఖేష్ తన లేఖలో పేర్కొన్నాడు. బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయట పడబోతుంది.. మీరు సీఎం హోదాలో చేసిన స్కామ్‌లతో పేద ప్రజలను దోచుకున్నారని సుఖేష్ ఆరోపించాడు. మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తనాంటూ హెచ్చరించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 11:15 AM

Advertising
Advertising