హౌరా-ముంబై రైలు పట్టాలు తప్పి ఇద్దరి మృతి
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:07 AM
ఝార్ఖండ్‌లో మంగళవారం రైలు ప్రమాదం సంభవించింది. హౌరా- ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది
రాంచీ, కోల్‌కతా, జూలై 30: ఝార్ఖండ్‌లో మంగళవారం రైలు ప్రమాదం సంభవించింది. హౌరా- ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో చక్రధర్‌పుర్ డివిజన్‌లో జరిగింది. 18 బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.1 చొప్పున రైల్వే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనా స్థలానికి దగ్గర్లోనే ఓ గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు.
Updated Date - Jul 31 , 2024 | 06:07 AM