ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రపంచంలో ఉత్తమ దేశం స్విట్జర్లాండ్‌

ABN, Publish Date - Sep 11 , 2024 | 06:25 AM

ప్రపంచంలో ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్‌ ఎంపికయింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ సంస్థ 2024 సంవత్సరానికి నిర్వహించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్‌ల్లో ఈ స్థానం లభించింది. ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్‌ ఎంపిక కావడం వరుసగా ఇది మూడోసారి కావడం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: ప్రపంచంలో ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్‌ ఎంపికయింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ సంస్థ 2024 సంవత్సరానికి నిర్వహించిన ఉత్తమ దేశాల ర్యాంకింగ్‌ల్లో ఈ స్థానం లభించింది. ఉత్తమ దేశంగా స్విట్జర్లాండ్‌ ఎంపిక కావడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో జపాన్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. భారత్‌కు 33వ స్థానం దక్కింది. గత ఏడాదితో పోల్చితే మూడు ర్యాంకులు తగ్గాయి. మొత్తం 89 దేశాల్లో సర్వే జరిపి ర్యాంకులు ఇచ్చారు. జీవన ప్రమాణాలు, సాహసాలు, వారసత్వం, వ్యాపార దక్షత, సాంస్కృతిక ప్రయోజనం తదితర పది అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజాభిప్రాయం సేకరించారు. స్విట్జర్లాండ్‌లో జీవన నాణ్యత, వాణిజ్యంలో పారదర్శకత బాగున్నట్టు తేలింది. భారత్‌ విషయానికి వస్తే ‘మూవర్స్‌’, ‘వారసత్వం’ అంశాల్లో మార్కులు వచ్చాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడేవారిని ‘మూవర్స్‌’గా నిర్వచించారు.

Updated Date - Sep 11 , 2024 | 06:25 AM

Advertising
Advertising