FSSAI : తల్లి పాలను అమ్మితే కఠిన చర్యలు
ABN, Publish Date - May 28 , 2024 | 05:55 AM
దేశంలో తల్లి పాలను మార్కెట్‌లో విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎ ఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) హెచ్చరింది. తల్లి పాలను అమ్మేందుకు
విక్రయాలకు అనుమతుల్లేవ్: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
న్యూఢిల్లీ, మే 27: దేశంలో తల్లి పాలను మార్కెట్‌లో విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎ ఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) హెచ్చరింది. తల్లి పాలను అమ్మేందుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మార్కెట్‌లో కొన్ని సంస్థలు తల్లి పాలను విక్రయిస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ స్పందించింది. తల్లి పాల అమ్మకం విషయంలో విక్రయదారులకు అనుమతులు మంజూరు చేయవద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. తల్లి పాలతో వ్యాపారం చేస్తున్న సంస్థలు వెంటనే దందాను ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Updated Date - May 28 , 2024 | 06:28 AM