చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి మట్టి, రాళ్లు
ABN, Publish Date - Jun 26 , 2024 | 05:35 AM
చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు చైనా ప్రయోగించిన చాంగే-6 స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమిని చేరింది. వస్తూ వస్తూ అక్కడి నుంచి రెండు కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. దీంతో, చంద్రుడి దక్షిణ ధ్రువం
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా కొత్త రికార్డు
బీజింగ్, జూన్ 25: చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు చైనా ప్రయోగించిన చాంగే-6 స్పేస్ క్రాఫ్ట్ తిరిగి భూమిని చేరింది. వస్తూ వస్తూ అక్కడి నుంచి రెండు కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తీసుకువచ్చింది. దీంతో, చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి నమూనాలను సేకరించిన తొలి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 లోని రిటర్నర్ మాడ్యూల్ భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.37 గంటలకు ఉత్తర చైనాలోని సిజివాంగ్ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. చాంగే 6ను మే 3వ తేదీన అంతరిక్షంలోకి ప్రయోగించారు. జూన్ 2వ తేదీన ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏకెన్ బేసిన్ వద్ద ల్యాండ్ అయింది. స్పేస్‌క్రా్‌ఫ్టలోని రోవర్ అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించింది. జూన్ 4న చాంగే-6లోని రిటర్నర్ మాడ్యూల్ తిరిగి అంతరిక్షంలోకి ఎగిరింది. మంగళవారం అది భూమిని చేరింది.
Updated Date - Jun 26 , 2024 | 05:35 AM