ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింగపూర్‌ పాస్‌పోర్టు పవర్‌ఫుల్‌

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:13 AM

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ట్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాలో సింగపూర్‌ మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల

న్యూఢిల్లీ, జూలై 24: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్ట్‌పోర్ట్‌ కలిగిన దేశాల జాబితాలో సింగపూర్‌ మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌ మూడు స్థానాలు మెరుగై 82వ స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 85వ స్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్టు ఉన్నవారిని వీసా లేకుండా 58 దేశాలకు అనుమతిస్తారు. భారత్‌తోపాటు సెనెగెల్‌, తజికిస్థాన్‌ కూడా 82వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో సింగపూర్‌ తన టాప్‌ ర్యాంకును నిలబెట్టుకుంది. సింగపూర్‌ పాస్‌పోర్టుతో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్టుగా అఫ్ఘానిస్థాన్‌ నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టు కలిగిన పౌరులు 26 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు.

Updated Date - Jul 25 , 2024 | 06:13 AM

Advertising
Advertising
<