ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

New SIM Card Rules: మొబైల్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. కొత్త నిబంధనలివే..!

ABN, Publish Date - Mar 18 , 2024 | 07:47 PM

TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్‌ను వేరే ఆపరేటర్‌కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం..

New SIM Card Rules

TRAI New Rules: టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) భారతదేశంలో సిమ్ కార్డ్(SIM Card) కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు(New SIM Card Rules) విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన పోర్ట్ చేసే వారికి వర్తించనుంది. మొబైల్ నెంబర్‌ను వేరే ఆపరేటర్‌కు పోర్ట్ చేసుకునే మొబైల్ వినియోగదారులపై దీని ప్రభావం ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. వినియోగదారులు సిమ్ కార్డ్‌ని రీప్లేస్ చేసుకున్న లేదా కొనుగోలు చేసిన ఏడు రోజుల వరకు తమ నెంబర్‌ను పోర్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు.

ఈ మధ్యకాలంలో సిమ్ కార్డ్‌తో మోసాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ట్రాయ్.. మొబైల్ నెంబర్‌లను పోర్టింగ్ చేసే విధానంలో స్వల్ప మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు సిమ్ కార్డును మార్చుకుంటే, లేదా రీప్లేస్ చేసుకుంటే.. సంబంధిత మొబైల్ నంబర్‌ను వేరే టెలికాం ఆపరేటర్‌కు ఏడు రోజుల పాటు పోర్ట్ చేయడం సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ నియమాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ప్రత్యేక పోర్టింగ్ కోడ్(UPC) కేటాయింపు అభ్యర్థనను రిజెక్ట్ చేయడానికి ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకువచ్చింది. మొబైల్ నెంబర్‌ను ఒక టెలికాం ఆపరేటర్ నుంచి మరొక టెలికాం ఆపరేటర్‌కు బదిలీ చేయడానికి యూపీసీ కోడ్ తప్పనిసరి. అయితే, కొత్త నిబంధన ప్రకారం.. సిమ్ స్వాప్, మొబైల్ నెంబర్‌ను మార్చిన తేదీ నుంచి ఏడు రోజుల గడువు ముగిసేపు యూపీసీ కోసం అప్లై చేస్తే.. యూపీసీ కేటాయించడం జరుగదు. ఇలా చేయడం వలన సిమ్ సంబంధిత మోసాలను అరికట్టవచ్చునని ట్రాయ్ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 07:47 PM

Advertising
Advertising