ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Watch Video: అయోధ్యలో ఇద్దరు ‘లెజెండ్స్’.. వైరల్ అవుతున్న వీడియో

ABN, Publish Date - Jan 23 , 2024 | 07:18 PM

జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.

జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి. క్రీడాకారులు, సినీ తారలు ఈ ప్రతిష్ఠాపనకు హాజరవ్వడం.. అక్కడ అందరూ కలిసి ముచ్చటించడం.. అభిమానులను ఆకట్టుకుంది.


ముఖ్యంగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఒక ఫ్రేములో కనిపించడం.. మరింత హైలైట్‌గా నిలిచింది. తమకు అందిన ఆహ్వానం మేరకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరు లెజెండ్స్.. ముందు వరుసలో పక్కపక్కనే కూర్చొని, ఈ వేడుకలని తిలకించారు. ఈ సందర్భంగానే.. సచిన్ ఒక వీడియోని తన ఫోన్‌లో రికార్డ్ చేశారు. తొలుత అయోధ్యలోని అద్భుత దృశ్యాల్ని తన ఫోన్‌లో చిత్రీకరించిన ఆయన.. ఆ తర్వాత రజినీతో కలిసి ఈ వేడుకకి హాజరయ్యానంటూ వీడియోలో చూపించారు. ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. అది నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఇద్దరు లెజెండ్స్‌ని ఇలా ఒకే ఫ్రేములో, అది కూడా రామమందిర ప్రారంభోత్సవంలో చూడటం నిజంగా కనులవిందుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సచిన్ ఆ వీడియోని షేర్ చేస్తూ.. “అయోధ్యలో కొత్త శ్రీరామ మందిరానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. దీని అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఎవరినైనా ఆకట్టుకునేలా సెట్ చేయబడింది” అని రాసుకొచ్చారు. శ్రీరాముని ఆశీస్సులు లభించినందుకు సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియోలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాంగణంలో హెలికాప్టర్ పూల వర్షం కురిపించడాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత రజినీతో కలిసి సచిన్ కలిసి ఈ వీడియోకి పోజులిచ్చారు.

Updated Date - Jan 23 , 2024 | 07:18 PM

Advertising
Advertising