ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi: 19న తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటన

ABN, Publish Date - Jan 06 , 2024 | 08:25 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఈనెల 19వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ముందుగా తిరుప్పూర్‌ చేరుకోనున్న ప్రధాని.. అక్కడ జరిగే బీజేపీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ‘

పెరంబూర్‌(చెన్నై): ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) ఈనెల 19వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ముందుగా తిరుప్పూర్‌ చేరుకోనున్న ప్రధాని.. అక్కడ జరిగే బీజేపీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ‘ఖేలో ఇండియా యూత్‌ 2024’ క్రీడా పోటీలు రాష్ట్రంలో ఈనెల 19న ప్రారంభమై 31వ తేది వరకు జరగనున్నాయి. చెన్నైలో జరగనున్న క్రీడా పోటీలు ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీని ఢిల్లీలో కలసిన రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో, ఖేలో ఇండియా పోటీలు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రానున్న ప్రధాని ఆ రోజు ఉదయం తిరుప్పూర్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా తిరుమురుగన్‌పూండిలో నూతనంగా నిర్మించిన ఈఎ్‌సఐ ఆసుపత్రిని ప్రారంభించనున్న ప్రధాని.. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం తిరుప్పూర్‌ పీఎన్‌ రోడ్డు, ఆండిపాళయం, మాదప్పూర్‌ తదితర మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్న నాయకులు, బహిరంగ సభకు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు బీజేపీ దక్షిణ జిల్లా కార్యదర్శి పి.సెంథిల్‌వేల్‌ తెలిపారు. అలాగే, ప్రధాని వచ్చే సమయం, బహిరంగ సభ ఏర్పాటుకానున్న ప్రాంతాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 08:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising