ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National Conference: ఎన్నికల బరిలో ఒమర్ అబ్దుల్లా

ABN, Publish Date - Apr 12 , 2024 | 05:35 PM

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ఆ పార్టీ అధినేత ఫారుఖ్ అబ్దుల్లా ప్రకటించారు. శుక్రవారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Omar Abdullah

శ్రీనగర్, ఏప్రిల్12: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) లోక్‌సభ ఎన్నికల ( Loksabha Elections 2024) బరిలో దిగుతున్నట్లు ఆ పార్టీ అధినేత ఫారుఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) ప్రకటించారు. శుక్రవారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తారని తెలిపారు. అలాగే శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి షియా నాయకుడు అగా సయ్యద్ రుహుల్లా మెహ్దీ పోటీ చేస్తున్నారని చెప్పారు.

President Rule: ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం.. రాష్ట్రపతి పాలన విధించేందుకు పన్నాగం

ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాదు.. జమ్ము కశ్మీర్‌ను విభజించి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిందీ బీజేపీ. దీంతో జమ్ము కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించకుంటే అసెంబ్లీ బరిలో దిగనని ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన విషయం విధితమే. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి మహ్మద్ అక్బర్ లోన్.. చేతిలో పీపుల్స్ కాన్ఫరెన్స్ అభ్యర్థి రజా అజీజ్ అలీ ఓటమి పాలయ్యారు.

Jaipur: కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే.. దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందన్న మోదీ

మరోవైపు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈ రోజు ఉదంపూర్‌లో ర్యాలీ నిర్వహించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్ర హోదా వస్తుందని స్పష్టం చేశారు. మరి కొద్ది రోజుల్లో జమ్ము కశ్మీర్ అసంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రజల కలలు త్వరలో నెరవేరబోతున్నాయని మోదీ ఆకాంక్షించారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 12 , 2024 | 05:40 PM

Advertising
Advertising