ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NEP 2020: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి..

ABN, Publish Date - Feb 26 , 2024 | 08:06 AM

National Education Policy 2020: విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం(Government of India) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనంటూ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 1వ తరగతిలో(School Admissions) ప్రవేశానికి వయోపరిమితికి సంబంధించి...

National Education Policy 2020

National Education Policy 2020: విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం(Government of India) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనంటూ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 1వ తరగతిలో(School Admissions) ప్రవేశానికి వయోపరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానం 2020(National Education Policy 2020) ప్రకారం 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితిని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

1వ తరగతిలో ప్రవేశానికి పిల్లల వయస్సు కనీసం 6 సంవత్సరాలు నిండి ఉండాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ (MOE) స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖ రాసింది. 2020లో నూతన విద్యావిధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి అనేకసార్లు ఈ సూచనలు జారి చేసిన కేంద్రం.. ఇప్పుడు మరోసారి గుర్తు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మరోసారి అలర్ట్ చేసింది.

కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ప్రకారం 2024-25 కొత్త అకడమిక్ సెషన్‌కు అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రాష్ట్రం/యూటీలో గ్రేడ్-1లో ప్రవేశానికి పిల్లల వయస్సు 6+ గా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మార్చి 2022లో అస్సాం, గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ, లడఖ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, గోవా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ సహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పిల్లలకు కనీసం 6 ఏళ్లు నిండి ఉంటేనే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది.

NEP 2020.. 5+3+3+4 పాఠశాల విధానం ప్రకారం, మొదటి ఐదు సంవత్సరాలలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల వారికి సంబంధించిన మూడు సంవత్సరాల ప్రీస్కూల్, ఆరేళ్ల వయస్సు నుంచి ఎనిమిదేళ్ల వరకు రెండు సంవత్సరాల 1, 2 తరగతులు ఉంటాయి. ఈ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయోపరిమితి 6 సంవత్సరాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 08:06 AM

Advertising
Advertising