ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెక్యులరిజమ్‌ యూరోపియన్‌ భావన!

ABN, Publish Date - Sep 24 , 2024 | 03:39 AM

సెక్యులరిజమ్‌ యూరోపియన్‌ భావన, భారతదేశానికి దాని అవసరమే లేదంటూ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్రదుమారాన్ని రేపాయి.

  • తమిళనాడు గవర్నర్‌ రవి వివాదాస్పద వ్యాఖ్యలు

చెన్నై, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సెక్యులరిజమ్‌ యూరోపియన్‌ భావన, భారతదేశానికి దాని అవసరమే లేదంటూ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్రదుమారాన్ని రేపాయి. కన్నియాకుమారిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారతీయులకు వ్యతిరేకంగా అనేక మోసాలు జరిగాయని, వాటిలో లౌకిక వాదానికి తప్పుడు వివరణ కూడా ఒకటని అన్నారు. సెక్యులరిజమ్‌ భారతీయ భావన కాదని, యూరోపియన్‌ భావన అని.., ఐరోపాలో చర్చిల నిర్వాహకులకు, రాజుకు మధ్య పోరాటాలు జరగటంతో ఆ చోట సెక్యులరిజమ్‌ పుట్టిందన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తుందని, కనుక సెక్యులరిజమ్‌ అవసరమేలేదన్నారు. గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళ రాజకీయ నేతలు మండిపడ్డారు. విరుదునగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ స్పందిస్తూ లౌకికవాదంపై గవర్నర్‌ రవి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, భారత రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధమైనవని తన ఎక్స్‌పేజీలో పేర్కొన్నారు.

Updated Date - Sep 24 , 2024 | 03:40 AM