ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌..

ABN, Publish Date - Apr 24 , 2024 | 01:59 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్‌ ఇచ్చారు.

స్వల్ప మోతాదులో ఇచ్చిన జైలు అధికారులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు షుగర్‌ స్థాయులు పెరగడంతో తక్కువ మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చినట్టు వారు మంగళవారం వెల్లడించారు. ఎయిమ్స్‌ వైద్యుల సలహా మేరకు సోమవారం సాయంత్రం లో డోస్‌ ఇన్సులిన్‌ రెండు యూనిట్లు ఇచ్చినట్టు తెలిపారు.

హనుమాన్‌ జయంతి రోజున తమకు ఈ వార్త ఎంతో ఆనందం కలిగించిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. హనుమంతుడు తన భక్తుడైన కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అందేలా చేశారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు వైద్యం అందించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి సౌరభ్‌ ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వడంతో ఆయనలో సుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్నాయన్న విషయం నిజమని రుజువైందన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 06:47 AM

Advertising
Advertising