కొత్త చట్టాలతో సులభతర జీవనం: మేఘ్వాల్
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:58 AM
దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు పౌరుల ‘సులభతర జీవనానికి’ సహకరిస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున రామ్ మేఘ్వాల్ అన్నారు. వీటి ద్వారా పౌరులకు సకాలంలో న్యాయం అందుతుందని,
న్యూఢిల్లీ, జూలై 4: దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన నేర న్యాయ చట్టాలు పౌరుల ‘సులభతర జీవనానికి’ సహకరిస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున రామ్ మేఘ్వాల్ అన్నారు. వీటి ద్వారా పౌరులకు సకాలంలో న్యాయం అందుతుందని, తద్వారా విలువైన సమయం ఆదా అవుతుందని చెప్పారు. గురువారం ఘాజియాబాద్‌లోని సీబీఐ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ఆ సంస్థ ఉద్యోగులకు పతకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఈ నూతన చట్టాలు న్యాయ ప్రక్రియను సులభతరం చేస్తాయని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఉత్తమమైన నైపుణ్య విఽధానాలు అవలంబిస్తుండడంతో సమాజంలో సీబీఐ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ మాట్లాడుతూ కొత్త క్రిమినల్ చట్టాల అమలులో రాష్ట్రాలు, ఇతర భాగస్వాములకు సహకారం అందిస్తామన్నారు.
Updated Date - Jul 05 , 2024 | 07:09 AM