ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Polls 2024: ఎన్నారైలకు ఓటు హక్కు ఉందా.. జైల్లో ఉన్న వ్యక్తి ఓటు వేయొచ్చా?

ABN, Publish Date - Apr 17 , 2024 | 05:06 PM

2024 లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అయితే.. ఎన్నికల సమయంలో సాధారణ ప్రజల మనసుల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి.

2024 లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls 2024) మొత్తం ఏడు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. అయితే.. ఎన్నికల సమయంలో సాధారణ ప్రజల మనసుల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఎవరెవరు ఓటింగ్ వేయగలరు? ఓటు వేయడానికి గల సరైన అర్హత ఏంటి? అసలు ఎన్నారైలకు ఓటు హక్కు ఉంటుందా? అనే ప్రశ్నలతో పాటు మరెన్నో సందేహాలు మెదులుతుంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.


దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

* భారతదేశంలో ఎవరు ఓటు వేయగలరు?

18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ.. జాతి, రంగు లేదా మునుపటి పరిస్థితితో సంబంధం లేకుండా పౌరసత్వ చట్టం ప్రకారం ఓటు హక్కును కలిగి ఉంటారు.

* ఎన్నారైలకు ఓటు హక్కు ఉందా?

మరే ఇతర దేశపు పౌరసత్వాన్ని పొందనంత కాలం.. ఎన్నారైలకు ఓటు హక్కు ఉంటుంది. భారతదేశంలోని తమ నివాస స్థలంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి వారు అర్హులు.

* పాట ఓటరు కార్డు పోతే.. కొత్త కార్డు పొందవచ్చా?

పాత ఓటరు కార్డు పోతే.. ఎఫ్ఐఆర్/పోలీస్ రిపోర్ట్ కాపీతో పాటు ఓటరుకి ఫారం-8 రసీదుపై ప్రత్యామ్నాయ EPICని జారీ చేయడం జరుగుతుంది.

* ఎన్నికల్లో అభ్యర్థులు ఇష్టమైనంత డబ్బు ఖర్చు చేయొచ్చు?

ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా తన ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేయకూడదు. కమిషన్ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ ఖర్చు చేసే హక్కు వారికి లేదు. ఒకవేళ ఏ అభ్యర్థి అయినా ఎక్కువ ఖర్చు చేస్తే.. అది అవినీతి పరిధిలోకి వస్తుంది. అప్పుడు సంబంధిత కమిషన్, IPC నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈసారి టైటిల్ ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్


* ఈవీఎం ద్వారా ఓటు వేసినట్లు ఎలా తెలుసుకోవాలి?

ఎన్నికల గుర్తు బటన్‌ని ఓటరు నొక్కిన తర్వాత.. దాని ముందున్న ఎల్‌ఈడీ వెలుగుతుంది. ఆ వెంటనే VVPAT స్లిప్‌ బయటకొస్తుంది. అందులో.. సీరియల్ నంబర్, అతని ఎన్నికల గుర్తు, ఇతర సమాచారం కనిపిస్తుంది. ఓటు వేసిన తర్వాత.. మీ ఓటు వేయబడిందని సూచించే ‘బీప్’ బిగ్గరగా ధ్వనిస్తుంది.

* జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఓటు వేయొచ్చా?

జైలులో ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో ఓటు వేసే అర్హత లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 62 (5) ప్రకారం.. జైలులో ఉన్న వ్యక్తి, లేదా పోలీసుల చట్టబద్ధమైన కస్టడీలో ఉన్న వారు ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు కారు.

* క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ ఎవరు?

సాయుధ దళాలకు చెందిన సర్వీస్ ఓటర్లు.. పోస్టల్ బ్యాలెట్ లేదా అతను నియమించిన ప్రాక్సీ ఓటరు ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. ప్రాక్సీ ద్వారా ఓటు వేయడానికి ఎంచుకున్న సేవా ఓటరును క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ (CSV) అని అంటారు.

* భారతదేశంలో ‘నాన్-సిటిజన్’ ఓటు వేయొచ్చా?

భారతదేశంలో ఓటు వేయడం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే పరిమితం. మరో దేశ పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తులు ఓటు వేయడానికి లేదా నమోదు చేసుకోవడానికి అర్హులు కారు. ఇంతకుముందు భారతీయ పౌరులుగా ఉండి, ఇప్పుడు వేరే దేశ పౌరసత్వం పొందిన వారికి కూడా ఓటు వేసే అర్హత ఉండదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 17 , 2024 | 06:35 PM

Advertising
Advertising