Share News

RCB: దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:10 PM

క్రీడలో ఒకట్రెండు సార్లు సరిగ్గా ప్రదర్శించకపోతే.. ఆ ఓటములు అభిమానులపై పెద్దగా ప్రభావం చూపించవు. ఆటలో గెలుపోటములు సహజమేనని సర్దిచెప్పుకుంటూ.. క్రీడాకారులకి, సదరు జట్టుకి అండగా నిలుస్తారు. ప్రస్తుతం ఎదుర్కొన్న ఓటమికి తదుపరి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలంటూ.. ఉత్సాహాన్ని నూరిపోస్తారు.

RCB: దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

ఏదైనా క్రీడలో (Sports) ఒకట్రెండు సార్లు సరిగ్గా ప్రదర్శించకపోతే.. ఆ ఓటములు అభిమానులపై పెద్దగా ప్రభావం చూపించవు. ఆటలో గెలుపోటములు సహజమేనని సర్దిచెప్పుకుంటూ.. క్రీడాకారులకి (Players), సదరు జట్టుకి అండగా నిలుస్తారు. ప్రస్తుతం ఎదుర్కొన్న ఓటమికి తదుపరి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలంటూ.. ఉత్సాహాన్ని నూరిపోస్తారు. కానీ.. పదే పదే ఓడిపోతూ ప్రతిసారి ఆశల్ని నీరుగారిస్తే ఎలా ఉంటుంది? అభిమానులు కచ్ఛితంగా సహనం కోల్పోయి తీవ్ర కోపాద్రిక్తులవుతారు. కోపం నషాళానికి అంటి, తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తారు. అగ్గిమీద గుగ్గిలమై.. నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేస్తారు.

మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!

ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుపై కూడా అభిమానులు అలాంటి కోపాన్నే ప్రదర్శిస్తున్నారు. ‘ఈసాలా కప్ నమ్‌డే’ అని చెప్తూ.. ఇంకెన్నాళ్లూ సాగదీస్తారని మండిపడుతున్నారు. తాజాగా టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి (Mahesh Bhupathi) సైతం ఆర్సీసీపై విరుచుకుపడ్డారు. ఆ జట్టుని అమ్మేయండని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘క్రికెట్‌ & ఐపీఎల్‌ అభిమానులు, ఆటగాళ్ళ కోసం బీసీసీఐని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీసీఐ చొరవ తీసుకుని.. ఆర్సీబీని జట్టుని అమ్మేయండి. స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి ఆ జట్టుని అప్పగించండి. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం’’ అంటూ భూపతి తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మరోసారి చుక్కెదురు.. అప్పటివరకు!


కాగా.. సోమవారం ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా.. ఆర్సీబీ దాదాపు లక్ష్యానికి చేరువలో వచ్చి ఓడిపోయింది. 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసి.. 25 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో నిరాశ చెందిన భూపతి.. ఎక్స్ వేదికగా పై విధంగా స్పందించాడు. ఆర్సీబీ అభిమాని అయిన భూపతి.. తన ఫ్రాంచైజీ పేలవ ప్రదర్శనతో విరక్తి చెంది ఈ ట్వీట్‌ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!

ఇదిలావుండగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ జట్టు కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం(10)లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్సీబీ జట్టు ప్లే-ఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలంటే.. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లోనూ తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. దీనికితోడు.. మెరుగైన రన్‌రేట్ సైతం సంపాదించాలి. ఒక రకంగా ఇది దాదాపు అసాధ్యమేనని అనిపిస్తోంది. మరి.. ఈ అసాధ్యాన్ని ఆర్సీబీ సుసాధ్యం చేస్తుందా? లేకపోతే ఎప్పట్లాగే తట్టాబుట్టా సర్దేస్తుందా? అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 04:21 PM