Share News

TS News: స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 PM

Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.

TS News: స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!
6-year-old boy drowns in GHMC swimming pool

హైదరాబాద్, ఏప్రిల్ 16: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఆ బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకీ క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడికి ఏం జరిగింది?... బాలుడు ఎలా చనిపోయాడో? వార్తల్లోకి వెళితే..

Big Breaking: జనసేన ఊపిరిపీల్చుకో.. హైకోర్టు గుడ్ న్యూస్!


అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని(Hyderabad) సనత్‌నగర్ ఇండోర్ స్టేడియంలో దారుణం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో బాలుడు పడి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న బాబు కార్తికేయగా గుర్తించారు. స్కూల్‌కు సెలవు కావడంతో స్నేహితులుతో కలిసి కార్తికేయ క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతూ ఉండగా స్విమ్మింగ్ క్రికెట్‌ బాల్ పూల్‌లో పడింది. అయితే ఆదివారం కావడంతో స్విమ్మింగ్ పూల్ బంద్ చేశారు. దీంతో గోడ దూకి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్లిన కార్తికేయ.. పూల్‌లో దిగి బాలు తీస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.


స్విమ్మింగ్ రాకపోవడంతో ఆ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడు నీటి మునగిపోవడాన్ని చూసిన తోటి స్నేహితులు ఆ విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. స్థానికు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి..

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

YSRCP: సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 01:09 PM