Share News

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:59 AM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల పట్ల ఏసీబీ దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ.

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...
Telangana ACB

హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) అవినీతి అధికారుల పట్ల ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారి పనిపడుతోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎవరీని కూడా ఏసీబీ అధికారులు విడిచిపెట్టడం లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్‌ చేసి మరీ చిక్కించుకుంటోంది ఏసీబీ. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదు అవుతున్న పరిస్థితి.

YSRCP: సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?


ఆ కేసుల్లో లోతుగా దర్యాప్తు...

రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా.. వంద రోజుల్లో ఏకంగా 55కి పైగా ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. అన్ని శాఖల్లో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ లిస్ట్‌లో ఉన్నారు. పది రోజుల్లో పలువురు పోలీసులు కూడా ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్నారు. మీర్‌పేట్‌ ఎస్సై, మాదాపూర్ ఎస్సై, స్టేషన్ రైటర్, అసిఫాబాద్ ఎస్సై ఏసీబీ వలలో పట్టుబట్టారు. లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ లోతుగా దర్యాప్తు సాగుతోంది.

Lok Sabha Polls: మేనిఫెస్టోలో ఎవరిది పై చేయి..ఎందులో ఏముంది..?


హెచ్ఎండీఏ శివ బాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా, తాసిల్దార్ రజినిపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదు అయ్యాయి. 1064 టోల్ ఫ్రీ నెంబర్‌ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలనే అధికారులు చూస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు అధికారులను ఏసీబీ ట్రాప్ చేసింది. ఒకే రోజు ఎస్సై, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డీఎంలను ఏసీబీ ట్రాప్ చేసింది. వీటితో పాటు గొర్రెల పంపిణీ మోసాలు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపైనా ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.


ఇవి కూడా చదవండి...

Hyderabad: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏కు బిగ్ షాక్.. సీనియర్‌ నేత రాజీనామా

TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 12:13 PM