Share News

TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:01 AM

Telangana: రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిగా చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది.

TS News: జూబ్లీహిల్స్ కేసులో మరోసారి దర్యాప్తు.. షకీల్ కొడుకు పాత్రపై అనుమానాలు
Jubilee Hills Road Accident Case

హైదరాబాద్, ఏప్రిల్ 16: రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో (Jubilee Hills Road Accident Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Bodhan Former MLA Shakeel ) కొడుకుని జూబ్లీ హిల్స్ పోలీసులు (Jubilee hills Police)నిందితుడిగా చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజోల్ రెండు నెలల కొడుకు రన్వీర్ మృతి చెందగా.. కాజోల్ తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరగిన వెంటనే కారులోని ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.

Hyderabad: నగరంలో భానుడి భగ.. భగలు.. మూసాపేట బాలాజీనగర్‌లో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత


విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టగా.. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా గుర్తించారు. ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ కోసం చూడగా లభ్యం కాని పరిస్థితి. కారు ఎవరు నడిపారు అన్నదానిపై గతంలో స్పష్టత లభించలేదు. అయితే కారు తానే నడిపాను అంటూ ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందని, భయంతో కారులో ఉన్న ముగ్గురం పారిపోయినట్లు ఆఫ్నాన్ వాంగ్మూలం ఇచ్చాడు.

Sriramanavami: శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..


దాంతో కేసులో ఆఫ్నాన్‌ను నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఛార్జ్‌షీట్‌ను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు దాఖలు చేశారు. అయితే తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన ఆఫ్నాన్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. కారు నడిపింది షకీల్ కొడుకు రాహెల్ అంటూ వారు చెప్పడంతో 304 పార్ట్ 2గా సెక్షన్లు మార్చారు. ఈ క్రమంలో కేసును మరోసారి జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.


ఇవి కూడా చదవండి...

MLC Kavitha: కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే పైచేయి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 05:05 PM