Share News

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే పైచేయి

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:47 AM

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయని ‘న్యూస్‌ఎక్స్‌’ ఆంగ్ల వార్తా చానల్‌ సర్వేలో తేలింది. 25 లోక్‌సభ స్థానాల్లో 14 తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుందని.. దాని

లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే పైచేయి

25 స్థానాల్లో 14 తెలుగుదేశానికి

జనసేన, బీజేపీలకు చెరో రెండు

వైసీపీ 7 సీట్లకే పరిమితం‘న్యూస్‌ఎక్స్‌’ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయని ‘న్యూస్‌ఎక్స్‌’ ఆంగ్ల వార్తా చానల్‌ సర్వేలో తేలింది. 25 లోక్‌సభ స్థానాల్లో 14 తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంటుందని.. దాని మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చెరో రెండు చోట్ల గెలుస్తాయని.. మొత్తంగా 18 సీట్లను ఎన్డీయే చేజిక్కించుకుంటుందని ఆ చానల్‌ వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ‘ఒపీనియన్‌ పోల్‌’ ఫలితాలను సోమవారం విడుదల చేసింది. గత ఎన్నికల్లో 22 లోక్‌సభ సీట్లను గెలుచుకున్న వైసీపీ.. ఈసారి ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ, విపక్షాల పనితీరు ఎలా ఉంటుంది.. ఎన్నెన్ని స్థానాలు గెలుస్తాయో వివరించింది. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబే సీఎం అవుతారని కూడా వ్యాఖ్యానించింది. ఇటీవల సీఎన్‌ఎన్‌-న్యూస్‌18, ఇండియాటుడే సర్వేల్లో కూడా టీడీపీ కూటమి సింహభాగం ఎంపీ సీట్లను గెలుస్తుందని తేలిన సంగతి తెలిసిందే.

Updated Date - Apr 16 , 2024 | 09:27 AM