Share News

AP News: రెచ్చిపోతున్న ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు..

ABN , Publish Date - Apr 16 , 2024 | 07:53 AM

వైసీపీ నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్ పేటలోని నక్కల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.

AP News: రెచ్చిపోతున్న ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు..

నెల్లూరు: వైసీపీ (YSRCP) నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్ పేటలోని నక్కల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ఎమ్మెల్యే మేకపాటి అనుచరుడు, రాజోలు సొసైటీ ఛైర్మన్ కల్లూరి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రతి రోజూ రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో యంత్రాలు, ట్రాక్టర్లతో తవ్వకాలు, రవాణా నిర్వహిస్తోంది. స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

CM Jagan: భీమవరంలో జగన్ సిద్ధం సభ.. జనం కోసం నేతలు ఆపసోపాలు

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 07:53 AM