పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు!
ABN, Publish Date - Jul 31 , 2024 | 06:09 AM
గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్ స్థాయి నుంచి
న్యూఢిల్లీ, జూలై 30: గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్ స్థాయి నుంచి గ్రామపంచాయతీ స్థాయి వరకు రోజు వారీ వాతావరణ వివరాలను అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సమాచారాన్ని అందించే బాధ్యతలను 2.69 లక్షల స్థానిక సంస్థలకు అప్పగించనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వర్గాలు తెలిపాయి. తద్వారా రైతులకు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుస్తాయని, దీంతో వారికి సాగు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే భారత వాతావరణ విభాగం ‘పంచాయతీ మౌసమ్ సేవ’ పోర్టల్‌ను ప్రారంభించింది. బ్లాక్(మండల) స్థాయిలో వాతావరణ పరిస్థితిని ఎప్పకటిప్పుడు అందిస్తోంది. దీనిని మరింత విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా 6లక్షలకు పైగా గ్రామాల్లో రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Updated Date - Jul 31 , 2024 | 06:10 AM