ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జెండాకు చైనా వస్త్రమా: సోనియా

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:28 AM

జాతీయ జెండా విషయంలోనూ ప్రధాని మోదీ ద్వంద్వ ఎజెండాను అనుసరిస్తున్నారని కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్‌ఘర్‌ తిరంగా’ నినాదంతో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చిన

న్యూఢిల్లీ, ఆగస్టు 20: జాతీయ జెండా విషయంలోనూ ప్రధాని మోదీ ద్వంద్వ ఎజెండాను అనుసరిస్తున్నారని కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్‌ఘర్‌ తిరంగా’ నినాదంతో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడంలో ఆయన(మోదీ) నైతికంగా ద్వంద్వ విధానాన్ని పాటిస్తారు. త్రివర్ణ పతాకం పొడగిట్టని సంస్థ పట్ల విధేయత చూపడం ఒకటైతే, పాలిస్టర్‌ సహా చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకుతో రూపొందిస్తున్న జెండాలను వినియోగించడం రెండోది’’ అని సోనియా దుయ్యబట్టారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది హిందూ’లో మంగళవారం ఆమె రాసిన ఓ ఆర్టికల్‌ రాశారు. జాతీయ జెండా రూపకల్పనకు కేవలం ఖాదీ వస్త్రాన్నే వినియోగించాలని సూచించారు. ‘ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం చేతితో నేసిన వస్త్రాలను మాత్రమే పతాక రూపకల్పనకు వినియోగించాలని సోనియా సూచించారు. కానీ, దానికి 2021లో సవరణలు చేసి.. పాలిస్టర్‌ సహా మిషన్‌పై రూపొందించిన వస్త్రాలను కూడా జాతీయ జెండా కోసం వాడుకునేలా నిబంధనలు మార్చేశారన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:28 AM

Advertising
Advertising
<