ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Conductor: కండక్టర్ కావరం.. మహిళపై చేయి చేసుకొని, ఆపై

ABN, Publish Date - Mar 27 , 2024 | 04:36 PM

బెంగళూరులో ఓ కండక్టర్ కోపంతో ఊగిపోయాడు. టికెట్ చార్జీ విషయమై మహిళతో తీవ్ర వాగ్వివాదం చేశాడు. తర్వాత మహిళను విచక్షణ రహితంగా దాడి చేశాడు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. సదరు కండక్టర్‌పై చర్యలు తీసుకున్నామని బీఎంటీసీ స్పష్టం చేసింది.

బెంగళూర్: ఆకాశంలో సగం, అవకాశంలో సగం అని మహిళల గురించి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. మహిళల (Women) కోసం పథకాలు అంటూ మాయ మాటలు చెబుతుంటారు. బెంగళూరులో (Bengaluru) ఓ మహిళపై కండక్టర్ చేయి చేసుకున్నాడు. టికెట్ విషయమై జరిగిన వాగ్వివాదం పెద్దదైంది. కోపంలో ఊగిపోయిన కండక్టర్ (Conductor) సదరు వ్యక్తి మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దానిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే..?

ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ బిలెకల్లి వద్ద బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సు ఎక్కారు. ఆమె శివాజీ నగర్ వెళ్తున్నారు. టికెట్ విషయమై కండక్టర్‌తో వాగ్వివాదం జరిగింది. ఆ వాదన తీవ్రతరం చేరింది. వెంటనే కండక్టర్‌ ఆమెపై దాడి చేశాడు. మహిళతో కండక్టర్ వాగ్వివాదం, చేయి చేసుకున్న ఫుటేజీ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

కంప్లైంట్

ఆ తర్వాత మహిళ జరిగిన ఘటన గురించి సిద్దాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో బీఎంటీసీ స్పందించింది. మహిళపై దాడి చేసిన కండక్టర్‌ను సస్పెండ్ చేశామని వివరించింది. కండక్టర్ హొనప్ప నాగప్ప అగసర్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. తమ సంస్థ బస్సుల్లో మహిళ ప్రయాణికుల రక్షణ కోసం అధిక ప్రాధాన్యం తీసుకున్నామని వివరించింది. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Karnataka: కాంగ్రెస్‌లో అసమ్మతి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు

Updated Date - Mar 27 , 2024 | 04:36 PM

Advertising
Advertising