ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bihar: ఉపేంద్ర కుష్వాహను శాంతపరిచిన బీజేపీ, ఎమ్మెల్సీ సీటు ఆఫర్

ABN, Publish Date - Mar 19 , 2024 | 08:21 PM

బీహార్‌ లో బీజేపీ తంత్రం ఫలించింది. రెండు లోక్‌సభ సీట్లు అడిగితే ఒకటే ఇచ్చారంటూ ఎన్డీయేపై అలిగి కూర్చున్న కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ను బీజేపీ శాంతపరిచింది. ఆర్ఎంఎల్‌కు ఎమ్మెల్సీ సీటును బీజేపీ ఆఫర్ చేసింది.

పాట్నా: బీహార్‌ (Bihar)లో బీజేపీ తంత్రం ఫలించింది. రెండు లోక్‌సభ సీట్లు అడిగితే ఒకటే ఇచ్చారంటూ ఎన్డీయే (NDA)పై అలిగి కూర్చున్న కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌ మోర్చా (RLM) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ (Upendra Kushwaha)ను బీజేపీ శాంతపరిచింది. ఆర్ఎంఎల్‌కు ఎమ్మెల్సీ (MLC) సీటును బీజేపీ ఆఫర్ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ బీహార్ ఇన్‌చార్జి వినోద్ తావడే మంగళవారంనాడు కుష్వాహను కలుసుకుని ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారు. రాంబలి చంద్రవంశీ తన సభ్యత్వాన్ని కోల్పోవడంతో బీహార్ ఎమ్మెల్సీ సీటు ఖాళీగా ఉంది.


కాగా, కుష్వాహాను కలుసుకున్న అనంతరం వినోద్ తావాడే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆ వివరాలు వెల్లడించారు. ఒక లోక్‌సభ సీటు, ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ సీటు ఆర్ఎంఎల్‌కు ఇవ్వాలని ముందుగానే నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహను ఈరోజు కలుసుకుని ఈ నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేసినట్టు చెప్పారు. ఎన్డీయేతో పొత్తులో భాగంగా కరకట్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఉపేంద్ర కుష్వాహ పోటీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 08:21 PM

Advertising
Advertising