రాజకీయేతర అంశాలతో ‘ప్రత్యేక హోదా’!
ABN, Publish Date - Jul 02 , 2024 | 05:20 AM
బిహార్, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని రాజకీయేతర అంశాల ఆధారంగానే నిర్ణయించాలని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్ సూచించారు. తక్కువ జనసాంద్రత ఉన్న కొండ ప్రాంతాలు, బలహీనమైన సరిహద్దు
ఆర్థిక సంఘానికి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్ సూచన
న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): బిహార్, ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని రాజకీయేతర అంశాల ఆధారంగానే నిర్ణయించాలని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్ సూచించారు. తక్కువ జనసాంద్రత ఉన్న కొండ ప్రాంతాలు, బలహీనమైన సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి అంశాల ఆధారంగా ప్రత్యేక హోదా ప్రమాణాలు నిర్ణయించబడ్డాయని ఆమె తెలిపారు. ఏపీ, బిహార్‌కు ఈ ప్రమాణాలు వర్తించవని ఆషిమా సోమవారం పీటీఐ వార్త సంస్థకుతెలిపారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రాయోజిత పథకానికి అవసరమైన నిధుల్లో 90ు, సాధారణ కేటగిరి రాష్ట్రాలకు 60 శాతం కేంద్రం సమకూరుస్తుందని, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆమె అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఇక నుంచి రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేకహోదా ఇవ్వకూడదని స్పష్టం చేసిందని తెలిపారు
Updated Date - Jul 02 , 2024 | 05:20 AM