బురద ప్రవాహంలో 5 గంటలు
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:59 AM
పెద్ద పెద్ద రాళ్లను, బురదను తోసుకుంటూ.. దూసుకుంటూ.. ప్రళయంలా ముంచెత్తుతున్న వరద ప్రవాహం! ఆ వెల్లువ ధాటికి తట్టుకుని నిలబడడం చాలా కష్టం!!
పెద్ద పెద్ద రాళ్లను, బురదను తోసుకుంటూ.. దూసుకుంటూ.. ప్రళయంలా ముంచెత్తుతున్న వరద ప్రవాహం! ఆ వెల్లువ ధాటికి తట్టుకుని నిలబడడం చాలా కష్టం!! కానీ.. వయనాడులో ప్రకృతి విలయానికి కేంద్రస్థానమైన ముండక్కైలో ఒక వ్యక్తి మాత్రం నడుములోతు బురదనీటిలో కూరుకుపోయి.. బండరాళ్ల మధ్య ఇరుక్కుని.. బయటపడే దారి లేక.. ఐదుగంటలపాటు ప్రాణాలు అరచేతపట్టుకుని అక్కడే ఉండిపోయాడు! అక్కడికి వచ్చిన సహాయక సిబ్బందిని చూసి.. చేతులు ఊపుతూ తన ప్రాణాలు కాపాడాలంటూ పెద్దగా కేకలు పెట్టాడు. సహాయ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి అతణ్ని ఎట్టకేలకు కాపాడి బురదనీటిలోంచి బయటకు తీసుకొచ్చారు. అయితే.. ముండక్కై ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలతో కలిపే బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అతడిని అక్కణ్నుంచీ మెప్పాడిలోని ఆస్పత్రికి తరలించలేకపోయారు.
Updated Date - Jul 31 , 2024 | 05:59 AM