ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mark Zuckerberg: ఆవులను పెంచుతున్న మార్క్ జుకర్‌బర్గ్..వాటికి పండ్లు, బీర్లు కూడా

ABN, Publish Date - Jan 10 , 2024 | 04:53 PM

టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల బాస్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు.

టెక్ వరల్డ్ బిలియనీర్, మెటా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల బాస్ మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) సరికొత్తగా కనిపించారు. ఇతని గురించి ఓ విచిత్రమైన అభిరుచి వెలుగులోకి వచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ ఆవులను పెంచుతూ కనిపించారు. అవును ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాలో ఒకరైన జుకర్‌బర్గ్ కొత్త అభిరుచి, ఆవుల పెంపకం అని తెలిసింది. అంతేకాదు అతను ఆవులకు డ్రై ఫ్రూట్స్, పండ్లతోపాటు బీరును కూడా అందిస్తున్నారు. అయితే అత్యుత్తమ ఆవు మాంసాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో భాగంగానే ఇది చేస్తున్నట్లు వెల్లడించారు.


అంతేకాదు హవాయిలోని ఓ ప్రదేశంలో జుకర్‌బర్గ్ ఇప్పటికే సగం ద్వీపంలో వీటిని కలిగి ఉన్నాడు. జుకర్‌బర్గ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆవులు, ఆవు మాంసం పట్ల తనకున్న అభిరుచిని ప్రకటించారు. అతను కాయైలోని కొయోలౌ రాంచ్‌లో ఆ పశువులను పెంచుతున్నానని పేర్కొన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ ఆ పోస్టులో మాంసం(meat) ముక్కను ఉంచి ఇది చాలా ఖరీదైనదని ప్రస్తావించారు.

అయితే ప్రస్తుతం ఆవు మాంసం కోసం వాటిని పెంచడం వివాదాస్పదమైన అంశం కావచ్చు. కానీ మాంసం ఉత్పత్తి పర్యావరణాన్ని ఎంత ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో పరిశీలిస్తే మాత్రం తాను బాధ్యతాయుతమైన రైతు(farmer)గా ఉంటానని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో భాగంగా ప్రతి ఆవు సంవత్సరానికి 5,000-10,000 పౌండ్ల ఆహారాన్ని తింటుందని అందులో భాగంగా చెట్లను పెంచడం సహా పలు రకాల పనుల్లో తన కుమార్తెలు కూడా పనిచేస్తారని చెప్పారు.

Updated Date - Jan 10 , 2024 | 04:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising