Ayushman Bharat: సీనియర్ సిటిజన్ల కోసం ఆయుష్మాన్ భారత్.. అప్లై చేయండిలా
ABN, Publish Date - Sep 16 , 2024 | 05:07 PM
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(AB PM-JAY)ను వృద్ధులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి అప్లై చేసే విధానం ఇదే..
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన(AB PM-JAY)ను వృద్ధులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదాయంతో సంబంధం లేకుండా 70, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ ఆయుష్మాన్ భారత్‌లో చేరవచ్చు. అధిక వైద్య ఖర్చుల కారణంగా ఎవరూ పేదరికంలోకి వెళ్లకూడదనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాంటి వారికి ఆర్థిక భద్రత, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా దాదాపు 4.5 కోట్ల కుటుంబాలు, ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు.. కుటుంబ ప్రాతిపదికన రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కవరేజీతో లబ్ధి పొందనున్నారు.
ప్రయోజనాలు..
వైద్య పరీక్షలు, చికిత్స, మెడికల్ ఇంప్లాంటేషన్, ఆహారం, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, రోగనిర్ధారణ, వసతి తదితర ప్రయోజనాలు ఆయుష్మాన్ భారత్ ద్వారా పొందవచ్చు.
అర్హులు వీరే
70 ఏళ్లు పైబడిన వారందరూ ఈ పథకానికి అర్హులే. వీరికి కుటుంబ ప్రాతిపదికన రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ లభిస్తుంది.
అదనంగా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద ఇప్పటికే చేరిన కుటుంబాలకు చెందిన సీనియర్ సిటిజన్ (senior citizen) లు వారి ఆరోగ్య బీమాపై రూ .5 లక్షల అదనపు టాప్-అప్ పొందుతారు. ఈ మొత్తాన్ని వారు వారి కుటుంబంతో పంచుకోవాల్సిన అవసరం లేదు.
ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న సీనియర్ సిటిజన్లు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు.
అయితే, CGHS (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం), ఆయుష్మాన్ CAPF (ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్), ECHS (మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం) వంటి వాటి నుంచి ప్రస్తుతం లబ్ధి పొందుతున్న వారు ఏదో ఒకదాంట్లో కొనసాగవచ్చు.
దరఖాస్తు ఎలా చేయాలి
Step 1: అధికారిక వెబ్‌సైట్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
Step 2: సమీపంలోని PMJAY కియోస్క్‌కు వెళ్లి ఏజెంట్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోండి. మీ వెంట ఆధార్ లేదా రేషన్ కార్డ్‌ని ఉంచుకోండి.
Step 3: అర్హతను నిర్ధారించడానికి కుటుంబ గుర్తింపు పత్రాలను సమర్పించండి.
Step 4: ధ్రువీకరించిన తర్వాత AB-PMJAY IDని కేటాయిస్తారు.
Step 5: AB-PMJAY IDని కలిగి ఉన్న మీ ఇ-కార్డ్‌ను ప్రింట్ తీసుకోండి.
For Latest News and National News click here
Updated Date - Sep 16 , 2024 | 05:17 PM