ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Olive Oil: ప్రతి రోజూ ఆలివ్ ఆయిల్‌ ఫుడ్స్ తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?

ABN, Publish Date - Mar 28 , 2024 | 06:52 PM

రోజూ ఆలివ్ ఆయిల్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.

ఇంటర్నెట్ డెస్క్: ఆలివ్ ఆయిల్ (Olive Oil).. ఈ కాలంలో దాదాపు అందరి వంటిళ్లల్లో కనిపించే నూనె ఇది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతే స్థాయిలో ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే, ఈ నూనెతో కలిగే ఉపయోగాలపై చాలా మందికి అవగాహన ఉండదు. మరి అవేంటో (Health Benefits), రోజూ ఆలివ్ ఆయిల్‌తో చేసిన ఫుడ్ తింటే ఏం జరుగుతుందో ఓమారు తెలుసుకుందాం.

Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్‌ బారినపడే ముందు శరీరంలో కనిపించే మార్పులు! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..


  • ఆలివ్ ఆయిల్స్‌లో పాలీఫినాల్స్, విటమిన్ ఈ, ఇతర అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి కాపాడతాయి.

  • శరీరంలో సుదీర్ఘకాలం ఇన్‌ఫ్లమేషన్ ఉంటే అది చివరకు డయాబెటిస్, ఆల్జైమర్స్, ఆర్థరైటిస్, ఒబెసిటీ వంటి వ్యాధులకు కారణమవుతంది. అయితే, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో ఈ పరిస్థితిని నివారించవచ్చు.

  • శరీరంలో రక్తప్రసరణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే ఆలివ్ ఆయిల్ స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడుతుంది. స్ట్రోక్‌తో పాటు గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షించే మోనోఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ అందించే ముఖ్యమైన ఆహారం ఆలివ్ ఆయిల్

Wet Hair: తడిజుట్టుతోనే నిద్రపోతున్నారా? ఇలా అస్సలు చేయొద్దని నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే..!

  • గుండె సంబంధిత సమస్యలు నివారించడంలో ఆలివ్ ఆయిల్‌కు తిరుగేలేదు. ఈ నూనెను అధికంగా వాడే మెడిటరేనియన్ దేశాల్లో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

  • తరచూ ఆలివ్ ఆయిల్ తినేవాళ్లకు ఊబకాయం నుంచి రక్షణ లభిస్తుంది.

  • మతిమరుపు, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తగుమోతాదులో రోజూ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలనేది నిపుణులు చెప్పే మాట

  • ఆలివ్ ఆయిల్‌కు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉండటం మరో విశేషం. అయితే, నూనె ఏదైనా పరిమితంగానే తీసుకోవాలనేది వైద్యులు అతి ముఖ్య సలహా

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 07:01 PM

Advertising
Advertising