Share News

Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!

ABN , Publish Date - Mar 10 , 2024 | 06:59 PM

చక్కెరపై ప్రజల్లో నెలకొన్న భయాలు వాస్తవాలు ఇవే!

Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: జీవనశైలి వ్యాధుల (LifeStyle Diseases) గురించి ప్రజల్లో అవగాహనతో పాటూ అపోహలు పెరిగాయి. ఏది తినాలి, ఏది తినకూడదు అనే విషయంలో పలు అవాస్తవాలు వ్యాప్తిలో ఉన్నాయి. జబ్బుపడతామనే భయంతో అనేక మంది ఆరోగ్యకరమైన (Health) ఆహారాన్నీ దూరం పెడుతున్నారు. చక్కెర విషయంలో ఈ అపోహలు (Sugar Myths) మరింత ఎక్కువ. మరి అవేంటో, వాస్తవాలు (Facts) ఏవో తెలుసుకుంటే అనవసర సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Viral: 50 ఏళ్లుగా కోకోకోలా తప్ప చుక్క నీరు కూడా తాగలేదు.. చివరకు ఇతడి పరిస్థితి ఏమైందో తెలిస్తే..

చక్కెర ఓ వ్యసనం

చక్కెరపై ఇష్టత చివరకు వ్యసనంగా మారుతుందని కొందరు అంటుంటారు కానీ ఇందులో నిజం లేదట. ఇది వ్యసనంగా మారొచ్చనేందుకు శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవని నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలు తింటే శరీరంలో డోపమైన్ హార్మోన్ పెరగొచ్చు కానీ ఇది వ్యసనానికి దారి తీయదు. కొందరికి సహజంగానే చక్కెర అన్నా తీపి వస్తువులు అన్నా ఇష్టత పెంచుకుంటారట.

చక్కెరతో షుగర్ వ్యాధి వస్తుంది

చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ వ్యాధి వస్తుందని కూడా కొందరు నమ్ముతారు. అందుకే మధుమేహానికి షుగర్ వ్యాధి అన్న పేరు స్థిరపడింది. అయితే, వయసు, జన్యుసంబంధిత సమస్యలు, జీవనశైలి, ఎక్సర్‌సైజ్ లేకపోవడం వంటి అంశాలే ప్రధానంగా డయాబెటిస్ వ్యాధి వచ్చే అవకాశాల్ని పెంచుతాయి.


చక్కెర అస్సలు ఉండని జీరో షుగర్ డైట్ బెటర్

బరువు తగ్గేందుకు కొందరు చక్కెరలు ఉండని జీరో షుగర్ డైట్ ఫాలో అవ్వాలని అంటుంటారు. ఇది కూడా ఓ అపోహే. వాస్తవానికి చక్కెర ఏ రూపంలో తింటున్నామన్న దానిపై బరువు పెరగడం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మార్కెట్లో చక్కెర పొడి లేదా స్వీటెన్డ్ బెవరేజస్ జోలికి అస్సలు వెళ్లకూడదు.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఆరోగ్యకరం

చక్కెరకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు మంచి ప్రత్యామ్నాయమని కొందరు భావిస్తుంటారు. ఇది వాస్తవం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు చివరకు వ్యసనంగా మారే అవకాశం ఉంది. వీటిని అధికంగా వినియోగిస్తే మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి.

చక్కెరతో పళ్లు పుచ్చిపోతాయి

చక్కెర అధికంగా తింటే పళ్లు పుచ్చిపోతాయని కొందరు అంటుంటారు. అయితే, పళ్ల సమస్యలకు చక్కెర ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. అనేక ఇతర కారణాలు ఉంటాయట. కాబట్టి, చక్కెరను మార్కెట్లో దొరికే పొడి రూపంలో కాకుండా పళ్లు, ఇతర ఆరోగ్యకర ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటే ఎటువంటి సమస్యా ఉండదని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 07:06 PM