Butter: వెన్నతో చేసిన వంటకాలు యమా రుచిగా ఉంటాయ్.. కానీ దీన్ని ఎక్కువ తింటే జరిగేదిదే..!
ABN, First Publish Date - 2024-02-06T14:45:29+05:30
వెన్న రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ దీన్ని ఎక్కువగా తింటే మాత్రం జరిగేదిదే..
వెన్న భారతీయ ఆహారంలో బాగా వినియోగించే పదార్థం. ఈమధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ నుంచి ఇంట్లో కాస్త స్పెషల్ వంటకాల వరకు వెన్నను విరివిగా ఉపయోగిస్తుంటారు. వెన్నతో చేసిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఇంట్లో తయారుచేసిన స్వచ్చమైన వెన్నలో బీటాకెరోటిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరమైన పోషకం. మాక్యులర్ డీజెనరేషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాకుండా కాల్షియం, రాగి, జింక్, సెలీనియం, మాంగనీస్ కూడా వెన్నలో ుంటాయి. కానీ వెన్నను అతిగా వినియోగించడం, ముఖ్యంగా మార్కెట్లో దొరికే వెన్నను వినియోగించడం వల్ల చాలా ప్రమాదాలున్నాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ఇది కూడా చదవండి: Zomato: అర్ధరాత్రి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ చేసిన ఆ రిక్వెస్ట్ కి ఆమె ఏం చేసిందంటే..
మార్కెట్లో లభించే వెన్నలో సోడియం, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తాన్ని మందంగా మారుస్తుంది. కొలెస్టాల్ పెరగడానికి కారణం అవుతుంది.
వెన్నను అధింగా తీసుకుంటే అందులో ఉన్న కొవ్వు పరిమాణం ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉందని డైటీషియన్లు చెబుతున్నారు.
వెన్నలో అధికమొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మార్కెట్లో అమ్మే వెన్నలో 63శాతం సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇది అనారోగ్యం.
ప్రతి 14గ్రాముల వెన్నలో 102కేలరీలు ఉంటాయి. అధిక కేలరీలు కలిగిన వెన్న అధికంగా తీసుకోవడం వల్ల చాలా సులువుగా బరువు పెరుగుతారు.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు ఈ 9పనులు చేస్తే చాలు.. పిల్లలలో కొండంత ఆత్మవిశ్వాసం నిండుకుంటుంది..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2024-02-06T14:45:31+05:30 IST