ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: మరోసారి ఐశ్వర్యారాయ్ పేరు లాగిన రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు..!

ABN, Publish Date - Apr 25 , 2024 | 10:12 AM

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణణ చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.

Rahul gandhi comments on Aishwarya rai

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ కుల గణన చేపడతామని, ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు తెలుసుకుంటామని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ``సామాజిక న్యాయ్ సమ్మేళన్``లో (Samajik Nyay Sammelan) రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. తనను నాన్-సీరియస్ పొలిటీషియన్‌గా ప్రతిపక్షాలు, మీడియా అభివర్ణించడం గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ (Aishwarya rai) పేర్లను ప్రస్తావించారు (Loksabha Elections).


``నన్ను కొన్ని మీడియా సంస్థలు నాన్-సీరియస్ పొలిటీషియన్ అంటున్నాయి. ఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, భట్టా పర్సౌల్ ఉద్యమం మొదలైన వాటి గురించి మాట్లాడడం వారి దృష్టిలో సీరియస్ కాదు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితేనే సీరియస్‌గా తీసుకుంటారా?`` అని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో కూడా అమితాబ్, ఐశ్వర్య పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.


``రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి సామాన్యులను, బీసీలను ఎందుకు ఆహ్వానించలేదు. ఆ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అంబానీ, అదానీ.. ఇలా అందరూ ధనవంతులే కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒక్క పేదవాడిని కూడా నేను చూడలేదు. ఒక్క రైతు, ఒక్క కార్మికుడు, ఒక్క నిరుద్యోగ యువకుడు ఆ కార్యక్రమంలో నాకు కనిపించలేద``ని రాహుల్ గాంధీ గత ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

Lok Sabha Election: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గా రామసహాయం రఘురాంరెడ్డి


ABN BIG Debate: గల్లా జయదేవ్‌ను పంపించినట్టు.. నన్ను ఎవరు ఏం చేయలేరు


మరిన్ని ఎన్నికల వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 25 , 2024 | 10:13 AM

Advertising
Advertising