ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మాలలపై ఎందుకీ అకారణ ద్వేషం?

ABN, Publish Date - May 24 , 2024 | 06:30 AM

కులకోణం ఎంతటి వ్యక్తినైనా సంకుచిత స్థాయికి దిగజారుస్తుందనటానికి సాహితీవేత్త పసునూరి రవీందర్ రాసిన వ్యాసం నిదర్శనం (‘సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నదెవరు?’,...

కులకోణం ఎంతటి వ్యక్తినైనా సంకుచిత స్థాయికి దిగజారుస్తుందనటానికి సాహితీవేత్త పసునూరి రవీందర్ రాసిన వ్యాసం నిదర్శనం (‘సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నదెవరు?’, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 10). పూర్వపు రాజరికపు ప్రభుత్వాలైనా, ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలైనా నామినేటెడ్ నియామకాల్లో సామాజిక న్యాయం కంటే కూడా సమర్థతకు, పార్టీ ప్రయోజనాలకు, ప్రతిష్టకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాయి. ఇది పాలితుల ఇష్టం. తమకు నష్టం జరిగిందనే కులంవారు ఆ ప్రభుత్వాల్నీ పార్టీనీ ప్రశ్నించాలి గాని, పక్క కులం వారిపై నిందమోపడం సరికాదు.


తెలంగాణలో అతిపెద్ద ‘కులం’ మాదిగలు అని, వారిని విస్మరించడం చారిత్రక ద్రోహమే అవుతుందని వాపోతున్నారు రవీందర్. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంట నిలిచిన మాదిగలెందరూ, పదేళ్ల కేసీఆర్ పాలనా కాలంలో కాంగ్రెస్‌ను కాపాడిన మాదిగలెందరనే అంశంపై వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీ ఉద్యమం చేస్తుండగా సికింద్రాబాద్ సిగ్మా హాస్పిటల్‌లో స్టీరింగ్ కమిటీ మీటింగ్‌పై ఎమ్మార్పీయస్ నేతలు దాడి చేసిన సందర్భం చరిత్రాత్మక ద్రోహం కాకమరేమిటి? చేసేది ద్రోహం, ఆపై అన్యాయమంటూ అరవడం... ఇదేంనీతి? అయినప్పటికీ తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా మాదిగ వ్యక్తినే కదా కేసీఆర్ నియమించింది? వచ్చిన అవకాశాన్ని కూడా నిలుపుకోకపోతే రెండవ వ్యక్తిని కూడా మాదిగనే నియమించారన్న విషయమూ మర్చిపోయారా?

1985 కారంచేడు ఊచకోతకు వ్యతిరేకంగా జరిగిన ఐక్య ఉద్యమ ఫలితంగానే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వచ్చింది. 1991 చుండూరు ఊచకోత సంఘటనలో ఐక్య ఉద్యమం అగ్రకులాలను దోషిగా నిలబెట్టింది. పైరెండు ఉద్యమాలు మాలల నాయకత్వంలో జరిగి, ఫలితంగా ఆంధ్ర అగ్రవర్ణాలకు మాలలు శత్రువులైనారు. 1994లో బీఎస్పీ అధినేత కన్షీరాం ఆంధ్ర మాలల సహకారంతో దక్షిణ భారతంలో తన రాజకీయ విస్తరణ చేస్తున్న రోజుల్లో ఆనాటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి ఆంధ్ర మాలలతో తనకున్న వైరం కారణంగా బీఎస్పీని నిలువరించడానికి ఎమ్మార్పీఎస్ అండదండలు తీసుకోవటంతో మొదలుకొని, 2023లో మాదిగ వ్యక్తి తన ఉన్నతోద్యోగం వదులుకొని బీఎస్పీ పగ్గాలు చేపట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మాదిగలే ఓట్లేయని సందర్భం దాకా మాదిగల రాజకీయ, సామాజిక ద్రోహం అనేకమార్లు ఋజువైంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైన మాదిగ నేత రాత్రికిరాత్రే గులాబీ గూటికిచేరి బహుజన ఉద్యమానికి చేసింది ద్రోహం కాదా? ఎమ్మార్పీఎస్ ఏర్పాటు అనంతరం జరిగిన 1998 వేంపేట, 2012 లక్ష్మిపేట ఊచకోత సంఘటనల్లో దళిత ఐక్య ఉద్యమం నీరు కారడానికి మాలలతో మాదిగలు కలసిరాకపోవడమే కారణం. ఇలా సామాజిక ఐక్య ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్రను చూడలేకపోతే ఎలా?


ఒకవైపు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గ్రీన్ హంట్ పేరుతో నరమేధం సృష్టిస్తున్న కేంద్రంలోని అధికార పార్టీ గత ఏడాది నవంబర్ 7న మాదిగ విశ్వరూప ‘ఎన్నికల ముసుగు’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అనైతిక వాదిది ఏకులం? ఇది ఖచ్చితంగా రాజకీయ, సామాజిక, విప్లవ ఉద్యమద్రోహమే! ఈసారి 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్నే మార్చివేసి రిజర్వేషన్లనే తొలగిస్తామని ఒకవైపు కాషాయపు పార్టీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటిస్తుంటే, లక్షలాదిమంది సాక్ష్యంగా అదే పార్టీ అగ్రనేత కాళ్లుపట్టుకొని, అదే కాషాయపు పార్టీకి కర్ణాటకలో ఓట్లువేయమని బరితెగించి బహిరంగంగా ప్రచారంచేసిన మిమ్మల్ని మేమేమీ అనలేదే? కేంద్రంలో కాషాయ పార్టీకే ఓట్లు వేయమని ప్రచారం చేస్తూ, గతంలో గాంధీ భవన్‌ను తగులబెట్టే ప్రయత్నం చేసి, గాంధీ భవన్ కాంగ్రెస్ మీడియా వేదికపైనే కూర్చుని వారినే దూషిస్తూ, మరలా కాంగ్రెస్ పార్టీని సీట్లు ఇవ్వమని అడగడమంటే గాడిదకు గడ్డివేసి ఆవుకు పాలుపిండుతామన్న చందంగా లేదూ! ఆ ఆవు తన్నకుండా ఉండదూ!

గులాబీ సర్కార్‌ హయాంలో మాదిగలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరిగింది అనడం పచ్చి అబద్ధం. ఉపముఖ్యమంత్రి పదవితోపాటు రెండు పర్యాయాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా! ఎస్సీ కార్పొరేషన్ రుణాలన్నీ మాదిగలకు ఇస్తాను అన్న ఆనాటి చైర్మన్ ప్రకటనలు మీరు మర్చిపోయినా సమాజం మర్చిపోదు. గులాబీ పార్టీ సర్కార్‌ అండతో ఎమ్మార్పీఎస్‌కు పోటీగా మరో ఎమ్మార్పీఎస్ నిర్మాణంలో మీరు లేరా? ఇది ద్రోహం కదా? 2014లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిపదవి ఇచ్చింది జగదీశ్వర్ రెడ్డికి. అతనేమైనా మాలనా? కొప్పుల ఈశ్వర్ కంటే సీనియర్ ఎస్సీ నేత గులాబీ పార్టీలో లేనప్పటికీ, మాదిగలే ఉన్నత పదవులు పొందారు. ఒక ఇతర పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీఎస్‌పీ‌ఎస్‌సీ చైర్మన్‌గా నియమింపజూపినా ఆ పదవిని తిరస్కరించింది మాదిగ కులం వ్యక్తే! ఇక ఉన్నతవిద్య మండలి చైర్మన్, యూనివర్సిటీ వీసీ పదవులు ఏ మాత్రం సాధారణ ప్రజలకు సంబంధం లేనివి. వాటితో మాల కులానికి ఒరిగిందేమీ లేదు. రాజకీయాల్లో సామాజిక న్యాయం గురించి మాట్లాడవలసివస్తే ముందుగా ముదిరాజ్, పద్మశాలి కులాల గురించి మాట్లాడాలి. జనాభాలో గణనీయమైన సంఖ్యాబలం కలిగిన వారి ప్రాతినిధ్యం చట్టసభల్లో దాదాపు కనుమరుగవుతున్నది.


అన్ని రాజకీయ పార్టీల్లో అగ్ర కులాలవారు ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు పొందినా మెదలని నోళ్ళు మాలల విషయంలో మాత్రం విషం కక్కుతున్నాయి! ఎమ్మార్పీఎస్ ఏర్పాటు నుండి వర్గీకరణ చట్టం తెచ్చేవరకు తెరవెనుక అన్నీతానై నిర్వహించిన ఆనాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కడియం శ్రీహరి కుటుంబం మాదిగ కాదు ఆంటున్న మీరు, సంఖ్యాబలం విషయంలో ఉపకులాలను కలుపుకోవడం మీ ద్వందబుద్ధికి నిదర్శనం. గులాబీపార్టీ అధికారంలో ఉన్న పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ అచేతనంగా పడి ఉన్నప్పుడు దానికి ఆక్సిజన్‌ మాదిరి ఊపిరులూది బతికించిన అద్దంకి దయాకర్‌కు దక్కాల్సిన తుంగతుర్తి సీటు ఒక మాదిగకే దక్కింది. ఎమ్మెల్సీ ప్రకటించి దక్కకపోయినా, రాజ్యసభ ఊహాగానాలు దూరమైనా, వరంగల్ ఎంపీ సీటు అంటూ దోబూచులాడి చివరకు అది గులాబీ మాదిగకే వెళ్ళిపోయినా మేము ఏమీ అనుకోలేదు. కొప్పుల రాజు మాదిగల కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసిన మీరు తుంగతుర్తి మాలల కోసం త్యాగం చేయాలని ఎందుకు అడగలేదు? మాలలు త్యాగాలు చేయాలి, మేము తన్నుకుపోతాం అన్నట్లుంది పసునూరి వాదన!


ఒక దఫాలో ఒక ఎంపీ సీటు, ఒక వీసీ పదవి రాకపోతేనే సామాజిక న్యాయం సమాధి అవుతున్నదని నిందలేస్తున్న మీరు తెలంగాణలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీలు, మున్సిపల్ చైర్మన్లు తదితర పదవులను మీ జనాభా శాతం కంటే ఎక్కువే పొందారు. దళితబంధు మూడెకరాల భూమి, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా తమ జనాభా శాతం కంటే ఎక్కువే పొందుతున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలో 45మందిలో 44మంది మాదిగలకు, కేవలం ఒకే ఒక్క మాల ఉపకులం వ్యక్తికి మాత్రమే మూడెకరాల భూమి లబించింది. 2014 నుండి 2024 వరకు సంక్షేమ పథకాల లబ్ధిదారుల లెక్కలకై ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేస్తే ఇలాంటివెన్నో నమ్మలేని నిజాలు బయటపడుతాయి. అశాస్త్రీయంగా మాకు అన్యాయం జరుగుతున్నదని గగ్గోలు చేస్తూ, ఉద్యమాలు చేస్తామని బెదిరిస్తూ, దగా పడ్డామనే ముసుగులో చాప కింద నీరులా రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో విస్తరిస్తున్న మాదిగ వర్గం వాదనలు ఇంకెంతో కాలం నిలబడలేవు. ఇలాంటి పసలేని వాదనలు చేసి పసునూరి పలుచన కారాదు.

మామిడి నారాయణ

Updated Date - May 24 , 2024 | 06:30 AM

Advertising
Advertising