ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తక్కువ జీతం... వెట్టి చాకిరి!

ABN, Publish Date - Aug 28 , 2024 | 01:32 AM

నాలుగు దశాబ్దాలుగా ఆర్ట్, క్రాఫ్ట్ రెగ్యులర్‌ టీచర్ల పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయలేదు. దీంతో విద్యార్థులు సృజనాత్మకతకు దూరమయ్యారు. విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 2012లో ప్రభుత్వం ఆర్ట్–క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లను...

నాలుగు దశాబ్దాలుగా ఆర్ట్, క్రాఫ్ట్ రెగ్యులర్‌ టీచర్ల పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయలేదు. దీంతో విద్యార్థులు సృజనాత్మకతకు దూరమయ్యారు. విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 2012లో ప్రభుత్వం ఆర్ట్–క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించింది. కానీ వీరంతా శ్రమదోపిడీకి గురవుతూ దశాబ్దకాలంగా అవమానాలను భరిస్తున్నారు. ‘బతకలేక బడి పంతులు’ సామెతను కొట్లాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో పాలకులు పునరావృతం చేశారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాజీవ్ విద్యా మిషన్’ కింద ఆర్ట్, క్రాఫ్ట్, పీటీఐ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా రోస్టర్ పద్ధతిలో రెగ్యులర్ ఉద్యోగ నియామకాల మాదిరిగా ఇంటర్యూ చేసి, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల మందిని నియమించగా, రాష్ట్రం విడిపోయాక 5 వేల మంది తెలంగాణలో మిగిలిపోయారు. తక్కువ జీతాలు, వేధింపులు భరిస్తూ ఎప్పటికైనా ఉద్యోగ భద్రత వస్తుందనే నమ్మకంతో 2400 మంది మిగిలారు. వీరికి పూర్తికాల విధులు చేస్తామని చెప్పి, అగ్రిమెంట్ బాండ్ తీసుకుని పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్ల (పీటీఐ) పేరుతో కొనసాగిస్తున్నారు. దీంతో వీరంతా 12 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నారు.


పార్ట్ టైం అనే పేరు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ టీచర్ల జీవితాలను ఆగం చేసింది. విలువైన విద్య బోధించే గురువులకు విలువ లేకుండా చేసింది. కేంద్రం సమగ్ర శిక్ష ద్వారా నిధులు మంజూరు చేస్తుంది. కేంద్రం నిధుల నుండి ఇచ్చే వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఇవ్వకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటాను కూడా ఏనాడూ ఇవ్వలేదు. వేసవి సెలవుల్లో వీరిని టెర్మినేట్ చేస్తూ, తిరిగి తీసుకోవడానికి నెలల తరబడి జాప్యం చేసి, జీతాలు ఎగ్గొట్టింది. కరోనా సమయంలో 21 నెలల జీతాలు కేంద్రం ఇచ్చినప్పటికీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు ఇవ్వలేదు. వీరికి రూ. 11,700 గౌరవ వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టింది. సమగ్ర శిక్షలో పని చేస్తున్న మిగతా విభాగాల వారికి రూ.20వేలకు పైగా ఇస్తారు. పీటీఐలకు మాత్రం కేవలం రూ.11,700, అదీ 10 నెలలు కూడా ఇవ్వడం లేదు.


ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు 12 ఏళ్లగా చేస్తున్న వెట్టిచాకిరీకి ఇకనైనా విముక్తి లభించాలి. విద్యా విలువలకు న్యాయం జరగాలి. స్కిల్స్ నేర్పించే సార్లకు స్కేల్ పెరగాలి. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 600 మంది ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లను ఆర్ట్, క్రాఫ్ట్ ఫోస్టుల్లో నియమించారు. ఇప్పటికీ ఇంకా 1700 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులను పార్ట్ టైంకు బదులుగా ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లుగా గుర్తించాలి. ఎస్జీటీ స్కేల్ కింద మినిమం బేసిక్ పేతో వేతనం ఇవ్వాలి. గత ప్రభుత్వంలోని పెద్దలు ఉపాధ్యాయులను తమ చుట్టూ తిప్పుకుని హామీలిచ్చి కాలం గడిపారు. దీంతో వీరంతా ఇతర కాంపిటీషన్‌ ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేస్తుందని వీరంతా ఎదురుచూస్తున్నారు.

కనుకుంట్ల కృష్ణహరి,

అధ్యక్షులు, ఆర్ట్–క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్

Updated Date - Aug 28 , 2024 | 01:32 AM

Advertising
Advertising
<