ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘స్వర్ణ భారత సామ్రాజ్ఞీ!’

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:53 AM

శ్రీ హిమగిరీంద్ర వజ్రకిరీటధారి! శుభకరారుణ కుంకుమ శోభితాస్య! శాంతిపారిజాత శోభిత స్వర్ణగాత్రి! స్వర్ణ భారత సామ్రాజ్ఞి! వందనమ్ము!...

శ్రీ హిమగిరీంద్ర వజ్రకిరీటధారి!

శుభకరారుణ కుంకుమ శోభితాస్య!

శాంతిపారిజాత శోభిత స్వర్ణగాత్రి!

స్వర్ణ భారత సామ్రాజ్ఞి! వందనమ్ము!

భారత మందిర ప్రాంగణమ్మున గణ

గణమ్రోగెరా– జయగంటలెల్ల!

‘ఝాన్సీ’కృపాణ– విజయదీప్తి! ‘తాంతియా’–

అల్లూరి’– వీర శంఖారవమ్ము!

‘లజపతి–బాల్‌–పాల్‌–తిలక్‌–భగత్సింగు–నే

తాజి–నెహ్రూ’ల స్వాతంత్ర్యభేరి!

‘గాంధి’– స్వరాజ్యదీక్ష– అహింసాత

పస్వి–స్వాతంత్ర్య సాఫల్యయాత్ర!

భారత–త్రివర్ణపతాక ఎఱ్ఱకోట

పైన విజయగర్వమున రెపరెపలాడ

భారత స్వతంత్రోదయ వజ్ర విభవ

చరిత! దివ్య సువర్ణాక్షర రచితమ్ము!!

కళ్యాణశ్రీ

(స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో)

Updated Date - Aug 15 , 2024 | 01:53 AM

Advertising
Advertising
<