దాశరథి శతజయంతి ప్రారంభ సభ
ABN, Publish Date - Jul 18 , 2024 | 01:09 AM
మన మానుకోట మట్టిబిడ్డ, మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ ఈ నెల 22వ తేదీ మహబూబాబాద్ ఎస్‌వి ఫంక్షన్ హాల్‌లో జరగనున్నది. దాశరథి జన్మభూమి చినగూడురు నుంచి...
మన మానుకోట మట్టిబిడ్డ, మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ ఈ నెల 22వ తేదీ మహబూబాబాద్ ఎస్‌వి ఫంక్షన్ హాల్‌లో జరగనున్నది. దాశరథి జన్మభూమి చినగూడురు నుంచి మహబూబాబాద్ వరకు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ జరుగుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు జరిగే సభకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళీ నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, జి. దేవీప్రసాద్, కె.విరాహత్ అలీ అతిథులు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వక్తలు. సభ తరువాత కవి సమ్మేళనం జరుగుతుంది.
తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
అధ్యక్షులు,
దాశరథి శతజయంతి ఉత్సవ కమిటీ
Updated Date - Jul 18 , 2024 | 01:09 AM