ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Today Horoscope: వావ్.. ఈ రాశుల వారికి అదిరిపోయే గుడ్ న్యూస్!!

ABN, Publish Date - Apr 18 , 2024 | 07:29 AM

వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు...

నేడు (18-4-2024 - గురువారం) వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు...

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. టెలివిజన్‌, క్రీడలు, చిట్‌ఫండ్‌ రంగాల వారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యుల వ్యవహార శైలి గురించి ఆలోచిస్తారు. ఇల్లు, స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విరామ కాలక్షేపాల ద్వారా మనశ్శాంతి కోసం ప్రయత్నిస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రియతముల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం అందుకుంటారు. విద్యా సంస్థలో ప్రవేశానికి అనుకూలం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దత్తకవచ పారాయణ శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. పాస్‌పోర్ట్‌, వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సాయినాధుని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వివాహ నిర్ణయాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. న్యాయ వివాదాల్లో పైచేయి సాధిస్తారు. దత్తకవచ పారాయణ శుభపద్రం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పన్నుల వ్యవహారాలు, వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతితో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఒప్పందాలకు అనుకూల సమయం. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడులకు సంబందించిన నిర్ణయాలు తీసుకుంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Apr 18 , 2024 | 07:32 AM

Advertising
Advertising