ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

FedEx Courier Fraud: ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసం.. టెర్రరిస్టులకు సరఫరా జరిగిందంటూ..

ABN, Publish Date - Apr 16 , 2024 | 09:01 PM

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో.. సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో కొందరు దుండగులు భారీ మోసానికి పాల్పడ్డారు.

సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో.. సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో కొందరు దుండగులు భారీ మోసానికి పాల్పడ్డారు. ముంబై (Mumbai), తైవాన్ (Taiwan) నుంచి బాధితులకు ఫోన్ చేసి.. మీ పేరు మీద డ్రగ్స్ బుక్ అయ్యిందని, మనీలాండరింగ్ జరిగిందంటూ భయపెట్టింది.. భారీ డబ్బుల్ని పోగేసుకున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?


ఇటీవల విశాఖపట్నంకి చెందిన ఓ వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్‌ని లిఫ్ట్ చేయగానే.. తాను ఫెడ్ఎక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నానని అవతలి వ్యక్తి తెలిపాడు. అనంతరం.. మీ అకౌంట్స్ నుంచి మనీలాండరింగ్ జరిగిందని పేర్కొన్నాడు. మీరు అక్రమ ఆయుధాలను రవాణా చేసినట్లు రిపోర్ట్ అందిందని, టెర్రరిస్టులకు నగదు సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని అన్నాడు. ముంబైలో మీ పేరు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని, మీరు విచారణకు తప్పకుండా రావాల్సిందేనని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు.. తానేం చేయలేదని, ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. అవతలి వ్యక్తి మరింత భయబ్రాంతులకు గురి చేశాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే, తాము అడిగినంత ఇవ్వాలని చెప్పాడు. దాంతో.. బాధితుడు వెంటనే తన అకౌంట్‌లో ఉన్న రూ.20 లక్షలను నిందితుడి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తిక్.. ఫక్కున నవ్వేసిన పఠాన్!

ఇలా రకరకాలుగా బెదిరింపులకు పాల్పడి.. ఎంతోమంది బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు లక్షల్లో సొమ్ముని కొల్లగొట్టాడు. దీనిపై తమకు సమాచారం అందడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చైనా, కంబోడియా వంటి దేశాల ఈ తతంగాన్ని నిందితులు నడుపుతున్నట్టు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్స్ వివరాల్ని తనిఖీ చేయగా.. రాజస్థాన్ కేంద్రంగా డబ్బులు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకొని, సైబర్ నేరగాల ముఠాలోని ఐదుగురిని సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ఆ నిందితుల్ని విచారించి, మరిన్ని వివరాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 09:01 PM

Advertising
Advertising