ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ లైఫ్‌టెక్‌ జీసీసీ

ABN, Publish Date - Sep 13 , 2024 | 04:54 AM

కార్లలో సీట్‌ బెల్ట్‌, ఎయిర్‌ బ్యాగులు, ఇతర భద్రతా పరికరాలు తయారుచేసే జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ లైఫ్‌ టెక్‌ తన కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): కార్లలో సీట్‌ బెల్ట్‌, ఎయిర్‌ బ్యాగులు, ఇతర భద్రతా పరికరాలు తయారుచేసే జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ లైఫ్‌ టెక్‌ తన కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెడ్‌ఎఫ్‌ ఇక్కడ జీసీసీని ప్రారంభించడంతో తెలంగాణ ప్రపంచ స్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయని, వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య 500 దాటుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రూడాల్ఫ్‌ స్టార్క్‌, ఇండియా ఈడీ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 04:54 AM

Advertising
Advertising