టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్
ABN, Publish Date - Apr 23 , 2024 | 03:07 AM
దేశీయ మార్కెట్లోకి లీడర్ ఎడిషన్ పేరుతో సరికొత్త ఫార్చ్యూనర్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుత కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా...
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం).. దేశీయ మార్కెట్లోకి లీడర్ ఎడిషన్ పేరుతో సరికొత్త ఫార్చ్యూనర్‌ను తీసుకువచ్చింది. ప్రస్తుత కస్టమర్ అవసరాలకు తగ్గట్టుగా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను రూపొందించినట్లు పేర్కొంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న లీడర్ ఎడిషన్ ధరలు వరుసగా రూ.35.93 లక్షలు, రూ.38.21 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. 2.8 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉండనుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) దీని ప్రత్యేకత అని తెలిపింది.
Updated Date - Apr 23 , 2024 | 03:08 AM