టీ-హబ్ ‘ల్యాబ్2మార్కెట్ ’
ABN, Publish Date - Sep 10 , 2024 | 02:51 AM
ల్యాబ్2మార్కెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ సోమవారం ప్రకటించింది. వినూత్న పరిశోధనల ద్వారా మార్కెట్‌కు అవసరమైన సరికొత్త ఆవిష్కరణలు...
న్యూఢిల్లీ: ల్యాబ్2మార్కెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్ సోమవారం ప్రకటించింది. వినూత్న పరిశోధనల ద్వారా మార్కెట్‌కు అవసరమైన సరికొత్త ఆవిష్కరణ లు చేపట్టడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. ఈ ప్రోగ్రామ్‌లో పాలుపంచుకునేందుకు 200 దరఖాస్తులు రాగా, 23 స్టార్ట్‌పలను ఎంపిక చేసినట్లు టీ-హబ్ వెల్లడించింది. పరిశోధకు లు, ఆవిష్కర్తలు తమ ఆలోచనలకు వాణిజ్య రూపమిచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని టీ-హబ్ పేర్కొంది. వీరిని ఇండస్ట్రీ నిపుణులు పర్యవేక్షించడం, మార్గనిర్దేశం చేయడంతోపాటు ఆలోచనలను వ్యాపారీకరించడం తో ఎదురయ్యే సవాళ్ల పరిష్కరించడంలోనూ తోడ్పడనున్నట్లు తెలిపింది.
Updated Date - Sep 10 , 2024 | 02:51 AM