ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డీ రేట్ల కోతకు సమయం ఆసన్నమైంది..

ABN, Publish Date - Aug 24 , 2024 | 06:25 AM

ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలో తగ్గించనున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ స్పష్టమైన సంకేతాలిచ్చారు. జాక్సన్‌ హోల్‌, వ్యోమింగ్‌లో శుక్రవారం జరిగిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కాన్సాస్‌ సిటీ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగించారు. ‘‘ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన సమయం

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

కాన్సాస్‌ సిటీ (అమెరికా): ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలో తగ్గించనున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ స్పష్టమైన సంకేతాలిచ్చారు. జాక్సన్‌ హోల్‌, వ్యోమింగ్‌లో శుక్రవారం జరిగిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కాన్సాస్‌ సిటీ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగించారు. ‘‘ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను సర్దుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్‌ ప్రయాణ దిశ స్పష్టంగా ఉంది. అయితే, వడ్డీ రేట్లను ఎప్పుడు తగ్గించాలి, ఎంత మేర తగ్గించాలనేది మున్ముందు విడుదల కానున్న స్థూల ఆర్థిక గణాంకాలు, భవిష్యత్‌ పరిణామాలు, లాభ, నష్టాల సమతుల్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంద’’ని ఆయన అన్నారు. దేశం (అమెరికా)లో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం క్రమంగా ఫెడ్‌ నియంత్రణ లక్ష్యమైన 2 శాతం దిశగా తగ్గుతూ వస్తోందన్న నమ్మకం పెరిగిందన్నారు. చారిత్రక గరిష్ఠానికి పెరిగిన ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు ఫెడ్‌ రిజర్వ్‌ 2022 మార్చి నుంచి 2023 జూలై మధ్యకాలంలో ప్రామాణిక వడ్డీ రేట్లను వరుసగా 11 సార్లు పెంచింది. దాంతో ఫెడ్‌ ప్రామాణిక రేట్ల శ్రేణి రెండు దశాబ్దాలకు పైగా గరిష్ఠ స్థాయి 5.25-5.50 శాతానికి చేరుకుంది. గడిచిన కొన్ని నెలల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతో వచ్చే నెలలో ఫెడ్‌ రేట్లు తగ్గవచ్చని మార్కెట్లో ఊహాగానాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. పావెల్‌ తాజా వ్యాఖ్యలు ఆ అంచనాలకు మరింత బలం చేకూర్చాయి.

Updated Date - Aug 24 , 2024 | 06:25 AM

Advertising
Advertising
<