ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూ.83 లక్షల కోట్లకు...

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:29 AM

తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు జాతీయ సగటు స్థాయిని మించిపోయింది. గత పదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎ్‌సడీపీ) వృద్ధి రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఈ కాలంలో తెలంగాణ ఏటా సగటున 10 శాతం

సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సాయి డి ప్రసాద్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు జాతీయ సగటు స్థాయిని మించిపోయింది. గత పదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎ్‌సడీపీ) వృద్ధి రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఈ కాలంలో తెలంగాణ ఏటా సగటున 10 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేసింది. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ చాప్టర్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి డి ప్రసాద్‌ ఈ విషయం చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎ్‌సడీపీ రూ.14.49 లక్షల కోట్లు (17,500 కోట్ల డాలర్లు)గా ఉండొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కాగా రానున్న సంవత్సరాల్లో రాష్ట్రం ఇదే వృద్ధి రేటు కొనసాగిస్తే 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూ.83.35 లక్షల కోట్ల (లక్ష కోట్ల డాలర్లు) స్థాయికి చేరుతుందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం సీఐఐ తెలంగాణ చాప్టర్‌ వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈలు, పర్యాటక రంగం, మెడికల్‌ టూరిజంపై ప్రధానంగా దృష్టి పెడుతుందని సాయి ప్రసాద్‌ చెప్పారు. విధానపరంగా ఎంఎ్‌సఎంఈలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు ఖాయిలా పడి న ఎంఎ్‌సఎంఈల పునరుద్ధరణకూ కృషి చేస్తామని సీఐఐ తెలంగాణ చాప్టర్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాచమల్లు ఫోర్జింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 05:29 AM

Advertising
Advertising